మోటొరోలా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. మోటో జీ73 పేరుతో తీసుకున్న రానున్న ఈ స్మార్ట్ ఫోన్ 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేస్తుంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Mar 02, 2023 | 8:51 PM
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజ సంస్థ మొటొరాలో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. మోటోజీ73 పేరుతో లాంచ్ చేయనున్న ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లోకి మార్చి 10వ తేదీన తీసుకురానుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 930 ఎస్ఓసీ చిప్‌సెట్‌తో వెనుకభాగంలో డ్యూయల్ కెమెరాలతో తీసుకురానున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లూ కలర్ ఫినిష్‌తో పాటు పలు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రానుంది.
ఇక ఇందులో 6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 33డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీని ఇవ్వనున్నారు
కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు సెల్ఫీ కోసం 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌లో డాల్బీ అట్మాస్ సౌండ్‌తో స్టీరియో స్పీకర్లను ఇవ్వనున్నారు.
ధర విషయానికొస్తే ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర భారత్‌లో రూ. 20,000 నుంచి అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. లాంచింగ్ రోజు ఈ ఫక్షన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.