News
Mohammad Siraj,మియా భాయ్ తగ్గేదేలే.. ఓకే ఓవర్‌లో 4 వికెట్లు.. శ్రీలంక 16/6 – asia cup final: outstanding bowling display from mohammad siraj fifer completed with in 16 balls
శ్రీలంకతో జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్‌లో భారత బౌలర్లు చెలరేగిపోతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు చుక్కలు చూపిస్తున్నారు. తమ పేస్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్.. నిప్పులు చెరిగే బంతులు వేస్తున్నాడు. ఏకంగా ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో ఈ ఫీట్‌ను సాధించాడు.
ఆ ఓవర్‌లో తొలి బంతికే నిసాంకను పెవిలియన్ చేర్చాడు. మూడో బంతికి సమరవిక్రమ, నాలుగో బంతికి అసలంక, ఆరో బంతికి ధనుంజయను పెవిలియన్ చేర్చాడు. సిరాజ్ విసిరే బంతులకు శ్రీలంక బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది.
మళ్లీ ఆరో ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన సిరాజ్.. నాలుగో బంతికి ప్రత్యర్థి కెప్టెన్ శనకను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో తాను వేసిన 16 బంతులకే 5 వికెట్లు పడగొట్టాడు.
అంతకుముందు ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో జస్‌ప్రీత్ బుమ్రా.. మూడో బంతికే కుశాల్ పెరీరాను ఔట్ చేశాడు. మొత్తంగా ఆరు ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 13 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.