News

mlc anantha babu, ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ మంజూరు.. కండీషన్స్ అప్లై! – rajahmundry court grants bail to mlc anantha babu


ఎమ్మెల్సీ అనంతబాబుకు తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గాను.. రాజమండ్రి కోర్టు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అనంత‌బాబు త‌ల్లి మంగార‌త్నం కిడ్నీ సంబంధిత వ్యాధితో కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆదివారం రాత్రి మృతి చెందారు. దీంతో తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు గాను అనంతబాబు తరఫు న్యాయవాదులు సోమవారం ఉదయం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై విచారించిన రాజమండ్రి కోర్టు.. అంత్యక్రియ‌ల‌కు హాజ‌ర‌య్యేందుకు గాను రూ. 25 వేల పూచీక‌త్తు, ఇద్దరి జామీనుతో కోర్టు ఎమ్మెల్సీకి బెయిల్ మంజూరు చేసింది. త‌ల్లి అంత్యక్రియ‌ల్లో పాల్గొన్న అనంత‌రం ఆయ‌న 25వ తేదీన తిరిగి రాజ‌మండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. కార్యక్రమం పూర్తయ్యే వ‌ర‌కు మూడు రోజుల పాటు ఆయ‌న ఎల్లవ‌రం గ్రామంలోనే ఉండాలి. అంత్యక్రియ‌ల స‌మ‌యంలో ఆయ‌న ప‌క్కన పోలీసులు కూడా ఉంటారు. అలాగే, హత్య కేసు గురించి ఎవ‌రి దగ్గరా ప్రస్తావించ‌కుండా ఉండాల‌ని కోర్టు ష‌ర‌తు విధించింది.

కాగా, అనంతబాబు తల్లి మంగారత్నం కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. నాలుగు రోజుల క్రితం కాకినాడ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం ఎల్లవరంలో అనంతబాబు తల్లి మంగారత్నం ఉంటున్నారు. ఆమె భర్త అనంత చక్రరావు అడ్డతీగల ఎంపీపీగా పనిచేశారు. అనంతబాబుతో పాటు ముగ్గురు కుమార్తెలు వారి సంతానం. కాగా, తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు మూడు నెలలుగా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఉన్న విషయం తెలిసిందే!

Related Articles

Back to top button