News
mission majnu trailer, రష్మిక కొత్త సినిమా ‘మిషన్ మజ్ను’ ట్రైలర్ రిలీజ్.. స్పై ఏజెంట్‌గా మల్హోత్రా – hero sidharthmalhotra mission majnu trailer is out now
ఈ మూవీలో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) లీడ్ రోల్ పోషిస్తుండగా.. అతను స్పై ఏజెంట్‌గా కనిపించబోతున్నాడు. స్థూలంగా ట్రైలర్లో ఏమని ఉందంటే? పాకిస్థాన్ నిబంధనలకి విరుద్ధంగా న్యూక్లియర్ బాంబుని తయారు చేస్తోంది. ఆ న్యూక్లియర్ బాంబుని మనం కచ్చితంగా నిర్వీర్వం చేయాలి. అలా చేయాలంటే మనకి ఇప్పుడు వెపన్స్ అవసరం లేదు. కానీ తెలివైన పర్సన్ కావాలి అంటూ ట్రైలర్లో మాటలు వినిపిస్తుండగా.. సిద్ధార్థ్ మల్హోత్రని చూపించారు. దాంతో అతనే స్పై ఏజెంట్ అని తేలిపోయింది.
శాంతను బాగ్చి ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. సిద్ధార్థ్ మల్హోత్రకి భార్యగా రష్మిక మందన కనిపిస్తోంది. అయితే.. ఈ మూవీలో రష్మిక పాత్రపై ట్రైలర్లో క్లారిటీ ఇవ్వలేదు. పాకిస్థాన్‌లో తయారు చేస్తున్న న్యూక్లియర్ బాంబ్‌ని ఎలా నిర్వీర్యం చేశారు? అందుకోసం స్పై ఏజెంట్ ఎలాంటి సాహసాలు చేశాడు? అనేదే ఈ సినిమా. ఈ మూవీని నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెటిప్లిక్స్లో రిలీజ్ చేస్తున్నారు.
రష్మిక మందన తమిళ్ హీరో విజయ్‌తో కలిసి నటించిన వారీసు మూవీ జనవరి 12న తమిళనాడులో థియేటర్లలోకి రాబోతోంది. కానీ తెలుగులో మాత్రం వారసుడు పేరుతో జనవరి 14న రిలీజ్ కానుంది. ఆ తర్వాత వారం వ్యవధిలోనే మిషన్ మజ్ను కూడా ప్రేక్షకుల ముందుకి వస్తోంది. రష్మిక మందన ప్రస్తుతం ఫుష్ప-2 మూవీ షూటింగ్లో బిజీగా ఉంది.
Read Latest Telugu Movies News , Telugu News