midhun reddy, ఆ 2 నియోజకవర్గాల్లో సీనియర్లకు వైసీపీ చెక్.. ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్లే! – ysrcp mp midhun reddy announced two mla candidates for next elections
2019లో రామచంద్రాపురం నుంచి బరిలోకి దిగిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విజయం సాధించారు. ఆ తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి కూడా అయ్యారు. ఇప్పుడు మరోసారి ఆయన పోటీపై క్లారిటీ ఇచ్చేయడం ద్వారా రామచంద్రాపురం వైసీపీలో ఆయన ప్రత్యర్థులు తోట త్రిమూర్తులు, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు క్లారిటీ ఇచ్చినట్లయింది.
అలాగే పెద్దాపురం సీటులో గత ఎన్నికల్లోనే దవులూరి దొరబాబుకు సీటు ఇవ్వాల్సి ఉండగా.. చివరి నిమిషంలో పార్టీలో చేరిన ఎంపీ తోట నర్సింహం సతీమణి తోట వాణిని ఇక్కడ బరిలోకి దింపారు. దీంతో ఇక్కడ ఆమెను టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చినరాజప్ప ఓడించారు. ఇప్పుడు ఎన్నికలకు చాలా ముందుగానే దొరబాబును అభ్యర్థిగా ప్రకటించారు.
మరోవైపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైసీపీకి కీలకంగా మారిన కోనసీమ అల్లర్ల కేసులపైనా ప్రభుత్వం దృష్టిసారించింది. ఏడాది క్రితం జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేసిన ఇతర పార్టీల నేతలు, సొంత పార్టీ నేతలపైనా వైసీపీ సర్కార్ కేసులు పెట్టింది. ఇప్పుడు ఆ కేసుల్ని ఎత్తేస్తామని ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటించారు.
కొద్ది రోజుల క్రితం మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి.. అల్లర్ల కేసులో కొందరు అమాయకుల పేర్లు ఉన్నాయని, దీనివల్ల యువత భవిష్యత్తు పాడవుతుందని సీఎం జగన్కు వివరించారన్నారు. వారిపై నమోదైన కేసులను ఉపసంహరించాలని కోరారని మిథున్‌రెడ్డి వెల్లడించారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ కేసుల్ని ఎత్తేస్తామని మిథున్ రెడ్డి వెల్లడించారు.