Mekapati ChandraSekhar Reddy, రెండేళ్లు ఆయన నా చుట్టూ తిరుగారు.. ఎమ్మెల్యే మేకపాటిపై శివచరణ్ తల్లి సంచలన వ్యాఖ్యలు – siva charan reddy mother sensational comments on ysrcp mla mekapati chandrasekhar reddy
చంద్రశేఖర్‌రెడ్డితో ఉన్న శాంతకుమారి పరిచయం కావడంతో.. చంద్రశేఖర్ రెడ్డి తమ ఇంటికి రావడం తగ్గించారని ఆమె ఆరోపిస్తున్నారు. అది తెలిసి మందలించడంతో పూర్తిగా రావడమే మానేశారని.. తాము కష్టాలు పడుతూనే ఉన్నామన్నారు. తనకు గతంలోనే వివాహమైందని.. రెండేళ్లకు భర్త నుంచి విడిపోయినట్లు చెప్పారు. తన పిన్ని దగ్గర ఉన్న సమయంలో.. తాను పెళ్లి చేసుకుంటానని ఇంటికి తీసుకెళతానని చంద్రశేఖర్‌రెడ్డి నమ్మించారని ఆమె వీడియోలో చెప్పుకొచ్చారు.
తమ ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదని.. రెండేళ్ల పాటు ఇంటి చుట్టూ చంద్రశేఖర్ రెడ్డి తిరిగారన్నారు. తనను తీసుకెళ్లి బెంగళూరులో కాపురం పెట్టారని.. దాదాపు 18 ఏళ్లు తమతోనే ఉన్నారన్నారు. బాబు శివచరణ్‌రెడ్డిని బాగా చూసుకునేవారని.. ఇప్పుడేమో డబ్బు కోసం వచ్చామని అబద్ధాలాడుతూ అవమానిస్తున్నారన్నారు. చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అవమానం భరించలేక.. ఇన్నేళ్ల తర్వాత బయటకు రావాల్సి వచ్చింది అన్నారు. డబ్బు కోసం వచ్చావని మాట్లాడటం సరికాదని.. ఎవరి దగ్గర ఎంత డబ్బుందో! ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అన్నారు. ఈ మేరకు ఆమె విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తన పేరు మేకపాటి శివచరణ్ రెడ్డి అంటూ ఓ యువకుడు రాసిన లేఖ వైరల్ అయ్యింది. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తన తండ్రిగా చెప్పుకొచ్చారు. తమను రహస్యంగా ఉంచారని.. ఎప్పుడూ బయటకు రావద్దని కోరారని.. అందుకే ఇన్నాళ్లూ ఆయనను ఇబ్బంది పెట్టలేదన్నారు. ఆయన ఆస్తి, రాజకీయ వారసత్వం అవసరం లేదని.. తన బాధను అర్థం చేసుకోవాలన్నారు.
ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. తనకు ఇద్దరు కుమార్తెలే ఉన్నారని.. అసలు కుమారులెవరూ లేరని క్లారిటీ ఇచ్చారు. తన భార్యలు తులసమ్మ, శాంతమ్మలకు పుట్టిన బిడ్డలు రచనా రెడ్డి, సాయి ప్రేమికా రెడ్డి అని.. కొందరు డబ్బుల కోసం తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోవాలంటే నేరుగా రావాలని.. వ్యక్తిగత జీవితంపై బురద జల్లాలని చూడటం సరికాదన్నారు.
- Read Latest Andhra Pradesh News and Telugu News