Entertainment

Kushboo-Megastar Chiranjeevi: సీనియర్ నటి ఖుష్బూపై చిరంజీవి ప్రశంసలు.. ఇకపై మీ వాయిస్ మరింత శక్తివంతమంటూ..


జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన ఖుష్భూకు నా శుభాకాంక్షలు. మీరు ఖచ్చితంగా ఈ పదవికి అర్హులు.

Kushboo-Megastar Chiranjeevi: సీనియర్ నటి ఖుష్బూపై చిరంజీవి ప్రశంసలు.. ఇకపై మీ వాయిస్ మరింత శక్తివంతమంటూ..

Megastar Chiranjeevi, Kushb

ఒకనాటి అందాల నటి.. ప్రస్తుత బీజేపీ మహిళా నేత ఖుష్బూకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా వ్యవహరిస్తున్న ఆమెకు కీలక పదవి దక్కిన సంగతి తెలిసిందే. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఎంపికైనా సందర్భంగా ఖుష్భూపై ప్రశంసలు కురిపించారు చిరు. “జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన ఖుష్భూకు నా శుభాకాంక్షలు. మీరు ఖచ్చితంగా ఈ పదవికి అర్హులు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా మీరు మహిళలకు సంబంధించిన అన్ని సమస్యలపై మరింత దృష్టి సారిస్తూ.. సమర్థవంతమైన పరిష్కారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. మహిళా సమస్యలపై పోరాడుతున్న మీ గొంతుక మరింత శక్తివంతగా మారుతుంది” అంటూ చిరు ట్వీట్ చేశారు.

ఖుష్భూను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తూ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్న ఖుష్బు కు ఇప్పుడు చట్టబద్ధమైన పదవి లభించింది. ఖుష్బూతో పాటు ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్న సీనియర్ సినీ ఆర్టిస్ట్ మమతా కుమారి, డెలీనా ఖోంగ్‌డుప్‌లు కూడా జాతీయ మహిళా కమిషన్ సభ్యులుగా నామినేట్ అయ్యారు. ఇందులో వారి పదవి కాలం మూడేళ్లు ఉంటుందని పేర్కొంది కేంద్ర ప్రభుత్వం. ఖుష్బూకి NCW మెంబర్‌గా పదవి దక్కడంపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై స్పందించారు.

ఇవి కూడా చదవండి



జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన ఖుష్బూకి బీజేపీ తరఫున అభినందనలు. ఇది ఆమె పట్టుదలకు, మహిళల హక్కుల కోసం చేస్తున్న పోరాటానికి దక్కిన గుర్తింపుగా వర్ణిస్తూ.. ఆయన ట్వీట్ చేశారు. అలాగే పలువురు బీజేపీ నేతలు, పలువురు సినీ ప్రముఖులు ఖుష్బూకి అభినందనలు చెప్పారు. మరోవైపు కేంద్రం జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించడంపై ఖుష్బూ సైతం స్పందించారు.

Advertisement

తనకు ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారామె. ప్రధాని నాయకత్వంలో నారీ శక్తిని పరిరక్షించడానికి, సంరక్షించడానికి, పోషించడానికి తాను తీవ్రంగా కృషి చేస్తానని అన్నారామె. చిత్ర పరిశ్రమలో 100కు పైగా సినిమాల్లో నటించిన ఖుష్బు మొదట డీఎంకే, కాంగ్రెస్ పార్టీలలో పదవులు నిర్వహించారు. ఆ తర్వాత బీజేపీలో చేరి ప్రస్తుతం ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఇప్పుడీ పదవి ఇవ్వడం పట్ల ఖుష్బూ.. ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button