megastar chiranjeevi, Waltair Veerayya లో చిరంజీవి ఐకానిక్ డ్యాన్స్ స్టెప్.. క్రేజీ అప్డేట్ వెలుగులోకి – megastar chiranjeevi recreated this iconic dance step in waltair veerayya
వాల్తేరు వీరయ్య మూవీలోని పాటలన్నింటికీ శేఖర్ మాస్టర్ కొరియా గ్రాఫర్‌గా వ్యవహరించాడు. ఇటీవల కాలంలో పెద్ద హీరో సినిమాలో పాటలన్నింటికీ ఒక్కరే కొరియోగ్రాఫర్‌గా ఉండటం చాలా అరుదు. ఈ మూవీలో ‘బాస్ పార్టీ’ అనే ఐటెం సాంగ్ ఉండగా.. ఈ పాటలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాతో కలిసి చిరంజీవి డ్యాన్స్ చేశారు. ఈ పాటలోని స్టెప్స్ చిరంజీవికి అమితంగా నచ్చడంతో మిగిలిన అన్ని పాటలకీ కూడా శేఖర్ మాస్టర్‌కే అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. దాంతో శేఖర్ మాస్టర్ కూడా ఇంద్ర మూవీలోని వీణ స్టెప్ తరహాలో చిరంజీవికి ఓ స్టెప్ని క్రియేట్ చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.
వాల్తేరు వీరయ్య మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని ఆదివారం విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్శిటీ ఇంజినీరింగ్ గ్రౌండ్స్‌లో ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌కి చిరంజీవితో పాటు మాస్ మహరాజా రవితేజ, శృతి హాసన్ తదితరులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌కి శృతి హాసన్ హాజరు కాలేదు. వాల్తేరు వీరయ్య మూవీకి సంబంధించి ఇప్పటికే సెన్సార్ వర్క్ మొత్తం పూర్తయిపోయింది. ఈ సినిమా నిడివి 160 నిమిషాలుకాగా.. యు/ఏ సర్టిఫికెట్‌ని ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ మూవీని నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ నిర్మించారు.
వాల్తేరు వీరయ్య మూవీకి పోటీగా నాలుగు సినిమాలు సంక్రాంతి రేసులో ఉన్నాయి. ఇందులో నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి ముందు వరుసలో ఉండగా.. సంతోష్ శోభన్ నటించిన ‘కళ్యాణం కమనీయం’ కూడా ఉంది. అలానే తమిళ్ హీరోలు విజయ్ నటించిన వారసుడు, అజిత్ నటించిన తెగింపు సినిమాలు కూడా ఈ సంక్రాంతికే రిలీజ్ అవుతున్నాయి. ఈ ఐదు సినిమాలు రోజుల వ్యవధిలోనే విడుదల కాబోతున్నాయి.
Read Latest Telugu Movies News , Telugu News