Entertainment

Megastar Chiranjeevi: మొగల్తూరులోని తన ఇంటిని అందుకే లైబ్రరీకి ఇవ్వలేదా ?.. చిరంజీవి చెప్పిన అసలు నిజాలు..


తన గురించి వస్తున్న అసత్యపు వార్తలపై ఏనాడు చిరు స్పందించి క్లారిటీ ఇవ్వలేదు. ఆయన మౌనం.. తన పై వస్తున్న రూమర్లకు మరింత బలం చేకూర్చాయి. ఫలితంగా ఎన్నో ఆరోపణలు.. వాటన్నింటిని సున్నితంగా పక్కకు పెట్టారు చిరంజీవి.

ఎలాంటి బ్యాగ్రాండ్ లేకుండా చిత్రపరిశ్రమలోకి నటుడిగా అడుగుపెట్టి మెగాస్టార్ అయ్యారు చిరంజీవి కొణిదెల. నటన పరంగా ప్రశంసలు అందుకుంటూనే.. తెలుగు చిత్రపరిశ్రమకు బ్రేక్ డాన్స్ పరిచయం చేశారు. తన స్టెప్పులతో కుర్రకారును ఉర్రూతలుగించారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా వచ్చిందంటే.. థియేటర్ల వద్ద రచ్చ జరిగేది. భారీ కటౌట్స్..పాలభిషేకాలు..హౌస్ ఫుల్ బోర్డ్స్.. ఒక్కటేమిటీ సినీ ప్రియులకు పండగే. అభిమానులంతా అన్నయ్య అంటూ ప్రేమగా పిలిచుకునేవారు. అతి తక్కువ సమయంలోనే స్వయం కృషితో స్టార్ హీరోగా ఎదిగిన చిరు గురించి అనేక రకాల రూమర్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొట్టేవి. ఇప్పటికీ మెగాస్టార్ గురించి పలు రకాల వార్తలు వింటుంటాం. అయితే తన గురించి వస్తున్న అసత్యపు వార్తలపై ఏనాడు చిరు స్పందించి క్లారిటీ ఇవ్వలేదు. ఆయన మౌనం.. తన పై వస్తున్న రూమర్లకు మరింత బలం చేకూర్చాయి. ఫలితంగా ఎన్నో ఆరోపణలు.. వాటన్నింటిని సున్నితంగా పక్కకు పెట్టారు చిరంజీవి.

ఇక ఇప్పుడు రీఎంట్రీలోనూ దూసుకుపోతున్నారు మెగాస్టార్. ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోలకు స్ట్రాంగ్ పోటీనిస్తూ వరుస చిత్రాలతో థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన.. ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమాతో మరోసారి రచ్చ చేసేందుకు సిద్ధమయ్యారు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం సంక్రాంతి కానుకగా రేపు (జనవరి 13న) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న చిరంజీవి.. తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాగే కొన్ని సంవత్సరాలుగా తనపై వచ్చిన ఆరోపణలకు క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే కొన్నేళ్లుగా మొగల్తూరులోని తన ఇంటిని గ్రాంథలయానికి ఇవ్వకుండా అమ్మేశారు అంటూ వచ్చిన వార్తల గురించి అసలు నిజాలు బయటపెట్టారు చిరు.

మొగల్తూరులోని తన ఇంటిని లైబ్రరీకి ఇవ్వకుండా రూ. 3 లక్షల కోసం అమ్మేసుకున్నారు కదా అనే ప్రశ్నకు చిరు మాట్లాడుతూ.. “అసలు అది నా ఇల్లు కాదు. అది నా మేనమామ శ్రీనివాసరావు ఆస్తి. ఆ ఇంట్లో మా అమ్మగారు ప్రసవించడం వల్ల తాను అక్కడ జన్మించాను. అక్కడే చదువుకున్నాను. అందువల్ల కేవలం చిరంజీవి ఇల్లు అంటారని. కానీ నిజానికి ఆ ఇల్లు నాదికాదు. మా మావయ్య ఆ ఇంటిని అమ్మేసుకుని వెళ్లిపోయారు. అయినా గ్రంథాలయాన్ని ఈ ప్రస్తావన రాకముందు కట్టించాను” అని అన్నారు. అప్పటికే మొగల్తూరులో లైబ్రరీ ఉంది అయినా కూడా తనది కానీ ఇంటిని లైబ్రరీ కోసం ఇవ్వమని ఎందుకు అంటున్నారో తనకు అర్థం కావడం లేదని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button