Megastar Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై స్పందించిన చిరంజీవి.. నా కుటుంబంలో వ్యక్తి పార్టీ పెడితే నాకు సంబంధమేంటీ అంటూ..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై స్పందించారు. పొరుగు రాష్ట్ర రాజకీయాల గురించి నాకెందుకు అని అన్నారు. ఆ రాజకీయాలు నాకు వద్దంటూ కుండబద్దలు కొట్టారు. నాకు ఏపీ పాలిటిక్స్ కు సంబంధం లేదు.
ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి..ఇప్పుడు వాల్తేరు వీరయ్య చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఫుల్ మాస్ యాక్షన్ లుక్లో డైరక్టర్ బాబీ దర్శకత్వంలో ఆయన నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గోంటున్న చిరు.. ఇటీవల తనపై వచ్చిన కామెంట్స్ గురించి రియాక్ట్ అయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై స్పందించారు. పొరుగు రాష్ట్ర రాజకీయాల గురించి నాకెందుకు అని అన్నారు. ఆ రాజకీయాలు నాకు వద్దంటూ కుండబద్దలు కొట్టారు. నాకు ఏపీ పాలిటిక్స్ కు సంబంధం లేదు. అక్కడ ఏం జరుగుతుందో.. పేపర్ల ద్వారా మీకు ఏం తెలుస్తోందో.. మీరు ఏం పరిశీలిస్తారో.. అంతే కంటే తక్కువ పరిశీలిస్తాను.. నా ఇంటికి పేపర్లు కూడా రావు.. నా ఫోకస్ మొత్తం సినిమా సినిమా అని.. రాజకీయాల గురించి పట్టించుకోను అని అన్నారు.
చిరంజీవి మాట్లాడుతూ..” నాకు ఓటు హక్కు ఎక్కడైతే ఉందో ఆ రాష్ట్రంలో ఉండి మాట్లాడుతున్నాను. నాకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. నాకు అక్కడ ఏం జరుగుతుందో ఏం తెలియదు. తెలుసుకోవాలన్న కూతుహాలం కూడా లేదు. నేను రాజకీయాలకు బహు దూరంలో ఉన్నాను. మా ఇంట్లో మరో వ్యక్తి రాజకీయాల్లోకి వెళ్లకూడదు అని అనుకోను. పాలిటిక్స్ లోకి వెళ్లడమనేది తన ఇష్టం. తను ఇండిపెండెంట్ వ్యక్తి. పవన్ నా తమ్ముడు.. తన రాజకీయాలకు నేను ఉన్నాను అనే అనుమానాలు చాలా ఉన్నాయి. నేను చాలా సార్లు క్లియర్ చేశాను. అయినా నా పేరు వస్తుంది. నేను రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ కావాలనుకోవడం లేదు” అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే తనకు విశాఖపట్నం ఇళ్లు ఉండాలని కోరుకున్నాను కానీ.. దానికి రాజకీయాలకు సంబంధం లేదన్నారు. అలాగే గతంలో దర్శకుల గురించి చేసిన వ్యాఖ్యలు డైరెక్టర్ కొరటాలను ఉద్దేశించి కాదన్నారు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించేందుకు అలా అన్నానని.. కానీ తన వ్యాఖ్యలను వక్రీకరించారని.. ఆ విషయంలో మళ్లీ క్లారిటీ ఇస్తున్నాను అని అన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.