News
megastar chiranjeevi, Bholaa Shankar మూవీపై మెగాస్టార్ చిరంజీవి క్రేజీ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే? – megastar chiranjeevi drops a solid update on bholaa shankar
చిరంజీవి నెక్ట్స్ మూవీ ‘భోళా శంకర్’.. ఈ సినిమాకి మెహర్ రమేశ్ దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్ నిర్మించబోతున్న ఈ సినిమా గురించి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన చిరంజీవి.. కొన్ని కీలక విషయాల్ని వెల్లడించారు. భోళా శంకర్ మూవీ షూటింగ్ ఇప్పటికే 30% పూర్తయిందని వెల్లడించిన మెగాస్టార్.. జనవరి 17 నుంచి నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభంకాబోతున్నట్లు చెప్పుకొచ్చారు.
ఇప్పటికే వేసుకున్న షెడ్యూల్ ప్రకారం.. షూటింగ్ పూర్తయితే మే నెలలో భోళా శంకర్ మూవీ థియేటర్లలోకి వస్తుందట. ఒకవేళ మే నెలలో రిలీజ్ చేయలేకపోతే.. దసరాకి మాత్రం పక్కాగా రిలీజ్ చేస్తామని చిరంజీవి స్పష్టం చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్ కూడా నటిస్తోంది. కానీ ఆమె చిరంజీవి చెల్లి పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
2022లో చిరంజీవి నటించిన ఆచార్య, గాడ్‌ఫాదర్ మూవీ అంచనాల్ని అందుకోలేకపోయాయి. దాంతో రేపు రిలీజ్ కాబోతున్న వాల్తేరు వీరయ్య మూవీపై మెగాస్టార్ గంపెడాశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఐదు పాటలు హిట్ అవగా.. ట్రైలర్ అంచనాల్ని పెంచేసింది. మరి మూవీ ఏ మేరకు ప్రేక్షకుల్ని అలరిస్తుందో చూడాలి.
Read Latest Telugu Movies News , Telugu News