Entertainment

Chiranjeevi: యాంకర్ సుమ కనకాల షోలో సందడి చేసిన మెగాస్టార్.. వీడియో వైరల్


పలు టీవీ షోలతో పాటు గేమ్ షోలు, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను హోస్ట్ చేస్తూ వాటిని సూపర్ హిట్స్ చేస్తూ రాణిస్తున్నారు సుమ. మలయాళీ అమ్మాయి అయినప్పటికీ తెలుగులో అనర్గళంగా మాట్లాడటం సుమ ప్రత్యేకత.

Chiranjeevi: యాంకర్ సుమ కనకాల షోలో సందడి చేసిన మెగాస్టార్.. వీడియో వైరల్

Chiranjeevi, Suma Kanakala

బుల్లితెర స్టార్ యాంకర్ గా దురుసుకుపోతున్నారు సుమ కనకాల. తనదైన మాటకారి తనంతో యాంకరింగ్ లో తనకు తానే సాటి అంటూ నిరూపించుకున్నారు సుమ. పలు టీవీ షోలతో పాటు గేమ్ షోలు, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను హోస్ట్ చేస్తూ వాటిని సూపర్ హిట్స్ చేస్తూ రాణిస్తున్నారు సుమ. మలయాళీ అమ్మాయి అయినప్పటికీ తెలుగులో అనర్గళంగా మాట్లాడటం సుమ ప్రత్యేకత. తనకున్న వాక్ చాతుర్యంతో ఎంతటి పెద్ద ఈవెంట్ నైనా సునాయాసంగా చేసేస్తుంటారు సుమ కనకాల. తాజాగా సుమ కనకాల హోస్ట్ చేస్తోన్న కొత్త గేమ్ షోలో సందడి చేశారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు సుమ. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సుమ యాంకర్ గా కొత్త గేమ్ షో మొదలు పెట్టారు. ప్రముఖ టీవీ ఛానల్ లో ఈ షో జరగనుంది. ఈ గేమ్ షోకు గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ క్రమంలో చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలోని పూనకాలు లోడింగ్ పాటకు సుమ డాన్స్ చేస్తూ ఉండగా సడన్ గా ఆ వీడియోలో కనిపించరు చిరంజీవి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమ కొత్త గేమ్ షో కు హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఈ వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ జనవరి 8న వైజాగ్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

Advertisement

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button