News

Megastar Chiranjeevi: మెగాస్టార్ సినీ ప్రస్థానానికి 44 ఏళ్లు.. ఎమోషనల్ ట్వీట్ చేసిన చిరంజీవి.. | Megastar chiranjeevi completed 44 years in tollywood cinema industry he shares special note


తెలుగు రాష్ట్రాల అభిమానులకు అన్నయ్య.. మెగాస్టార్ చిరంజీవి నటుడిగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి నేటికి 44 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు చిరు.

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తన ప్రతిభతో.. స్వయంకృషితో తెలుగు చిత్రపరిశ్రమలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi). అవమానాలు.. అడ్డంకులు.. ఎన్నో సవాళ్లను అధిగమించి ఇండస్ట్రీలో విజేతగా నిలిచారు. అంతేకాకుండా పరిశ్రమలో బ్రేక్ డాన్స్ పరిచయం చేసిన.. స్టెప్పులతో కుర్రకారును ఉర్రూతలుగించారు. తెలుగు సినిమాగు గుర్తింపు లేని రోజుల్లోనే జాతీయ స్థాయిలో తెలుగు చిత్రాన్ని నిలబెట్టాడు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్‏ను సైతం వెనక్కు నెట్టి ఒక్క సినిమాకు రూ.కోటికి పైగా రెమ్యునరేషన్ తీసుకున్న ఏకంగా హీరోగా రికార్డ్ సృష్టించాడు. ప్రాణం ఖరీదు సినిమాతో సినీ ప్రస్థానం మొదలు పెట్టి.. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని తెలుగు ప్రజల గుండెల్లో మెగాస్టార్‏గా స్థానం సంపాదించుకోవడమే కాకుండా అన్నయ్యగా యువతకు చేరువయ్యాడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో బాక్సాఫీస్‏ను షేక్ చేసిన హీరో చిరు. ప్రతిభ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించాడు. చిరంజీవిని స్పూర్తిగా తీసుకుని బ్యాగ్రౌండ్ లేకుండా..టాలెంట్‏తో పరిశ్రమలో అడుగుపెట్టి నటీనటులుగా గుర్తింపు తెచ్చుకున్నవారు అనేక. తెలుగు రాష్ట్రాల అభిమానులకు అన్నయ్య.. మెగాస్టార్ చిరంజీవి నటుడిగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి నేటికి 44 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు చిరు.

” మీకు తెలిసిన ఈ చిరంజీవి, చిరంజీవిగా పుట్టిన రోజు ఈరోజు. 22 సెప్టెంబర్ 1978. ప్రాణం ఖరీదు ద్వారా ప్రాణం పోసి.. ప్రాణప్రదంగా..నా ఊపిరై.. నా గుండె చప్పుడై.. అన్నీ మీరే అయి 44 సంవత్సరాలు నన్ను నడిపించారు. నన్నింతగా ఆదరించిన ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానుల ఋణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఎప్పటికీ మీ చిరంజీవి ” అంటూ రాసుకొచ్చారు మెగాస్టార్. ప్రస్తుతం చిరు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండిమరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండిRelated Articles

Back to top button