News

Medical Jobs: వైఎస్సార్‌ జిల్లా గవర్నమెంట్‌ హాస్పిటల్స్‌లో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే.. | Ysr district DMHO Invites applications for various posts Telugu Education News


Medical Jobs: ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లా డీఎంహెచ్‌వో పరిధిలోని ప్రభుత్వాసుపత్రుల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను కాంట్రాక్ట్‌/ అవుట్‌ సోర్సింగ్ విధానంలో తీసుకోనున్నారు…

Medical Jobs: ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లా డీఎంహెచ్‌వో పరిధిలోని ప్రభుత్వాసుపత్రుల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను కాంట్రాక్ట్‌/ అవుట్‌ సోర్సింగ్ విధానంలో తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 79 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో బయో మెడికల్ ఇంజినీర్ (01), డైటీషియన్ (01), ఫిజియోథెరపిస్ట్ (01), రేడియోగ్రాఫర్ (02), ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 (16), ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II (13), ఈసీజీ టెక్నీషియన్ (02), డెంటల్ టెక్నీషియన్ (01), ఎలక్ట్రీషియన్ (01), ల్యాబ్ అటెండెంట్ (06), జనరల్ డ్యూటీ అటెండెంట్లు (22) ప్లంబర్ (04), ఫీమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ (07), శానిటరీ వర్కర్ కమ్ వాచ్‌మెన్ (02) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను ఖాళీల ఆధారంగా పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, డీఫార్మసీ, బీఫార్మసీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను, సంబంధిత సర్టిఫికెట్స్‌ను జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, కడప, వైఎస్‌ఆర్‌ జిల్లా అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.

Advertisement

* దరఖాస్తు ఫీజుగా రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా ఎంపి చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 20-08-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

ఇవి కూడా చదవండి



మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button