News

MBA Chai Wala: రూ.కోట్లు పెట్టి ఖరీదైన బెంజ్ కారు కొన్న చాయ్ వాలా..! దేశవ్యాప్తంగా పాపులర్‌.. | MBA Chai Wala bought a Benz car video goes viral Telugu news video


చదివింది డిగ్రీ.. చేసేదీ చాయ్ బిజినెస్.. ఏకంగా కోట్లు సంపాదిస్తున్నాడు.. ప్రఫుల్ బిల్లోర్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ ‘ఎంబీయే చాయ్ వాలా’ అంటే మాత్రం ఎక్కువ మందికి తెలుసు..

చదివింది డిగ్రీ.. చేసేదీ చాయ్ బిజినెస్.. ఏకంగా కోట్లు సంపాదిస్తున్నాడు.. ప్రఫుల్ బిల్లోర్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ ‘ఎంబీయే చాయ్ వాలా’ అంటే మాత్రం ఎక్కువ మందికి తెలుసు. MBA మధ్యలోనే ఆపేసి IIM అహ్మదాబాద్ వెలుపల ఎనిమిది వేల రూపాయలతో టీ స్టాల్ ప్రారంభించి ఈ రోజు రూ. 90 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన లగ్జరీ కార్ కొనుగోలు చేసే స్థాయికి ఎదిగాడు. మధ్యప్రదేశ్‌లో బీకామ్‌ పూర్తి చేసిన ‘ప్రఫుల్ బిల్లోర్’ ఎంబీఏ చేయాలని ఎన్నో కలలు కన్నాడు. కానీ మంచి ర్యాంక్ రాకపోవడంతో ఉపాధికోసం అంట్లు తోమే పనిలో చేరాడు. అనంతరం తాను ఎంబీఏ చేయాలనుకున్న క్యాంపస్ పక్కెనే టీ స్టాల్ ప్రారంభించి అంచలంచెలుగా ఎదుగుతూ కోట్ల బిజినెస్‌ను సాధించాడు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ‘ఎంబీయే చాయ్ వాలా’ పేరుతో పాపులర్‌ అయ్యాడు. ఎంబీఏ చాయ్‌వాలా అకాడమీని ప్రారంభించి ఆంట్రప్రెన్యూర్‌షిప్‌లో స్పెషల్‌ కోర్స్‌ అందిస్తున్నాడు. తాజాగా అతను ఓ ఖరీదైన బెంజ్‌ కారు కొనుగోలు చేయడం విశేషంగా నిలిచింది. కేవలం ఎనిమిది వేలతో ప్రారంభమైన ప్రఫుల్ ప్రయాణం ఈ రోజు మెర్సిడెస్ బెంజ్ కారు కొనుగోలు చేసే స్థాయికి చేరింది. అలాగే మోటివేషనల్ స్పీకర్‌గా కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.

Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?

Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..

Advertisement

Related Articles

Back to top button