Entertainment

Dhamaka: దూసుకుపోతోన్న ధమాకా సాంగ్.. మాస్ చార్ట్ బస్టర్ హిట్ గా జింతాక్ సాంగ్


ఇప్పుడు రవితేజ ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసిమీదున్నాడు. ఈ క్రమంలోనే..  కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.  మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా  ధమాకా అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

మాస్ మహారాజా రవితేజ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు. చాలా కాలంగా రవితేజ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అప్పుడెప్పుడో వచ్చిన రాజా ది గ్రేట్ తర్వాత ఈ మధ్య వచ్చిన క్రాక్ తప్ప సాలిడ్ హిట్ అందుకోలేదు రవితేజ. ఇక ఇప్పుడు రవితేజ ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసిమీదున్నాడు. ఈ క్రమంలోనే..  కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.  మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా  ధమాకా అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

“ధమాకా” ఆల్బమ్ లోని జింతాక్ పాట మాస్ చార్ట్ బస్టర్ హిట్ గా నిలిచింది. తాజాగా జింతాక్ పాట 26 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి సెన్సేషనల్ సాంగ్ గా అలరిస్తోంది. భీమ్స్ సిసిరోలియో మాస్ డ్యాన్స్ ట్యూన్ గా కంపోజ్ చేసిన ఈ పాటకు అన్ని వర్గాల నుండి ట్రెమండస్ రెస్పాన్ వస్తోంది. ప్రతి రెండు రోజులకు వన్ మిలియన్ వ్యూస్ పెంచుకుంటూ యూట్యూబ్, మ్యూజిక్ ఫ్లాట్ ఫామ్స్ లో దూసుకుపోతుంది జింతాక్ సాంగ్.

జింతాక్ పాటలో రవితేజ మాస్ డ్యాన్సులు ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేశాయి. రవితేజ, శ్రీలీల కెమిస్ట్రీ ఆకట్టుకుంది. భీమ్స్ సిసిరోలియో, మంగ్లీ ఈ పాటని ఎనర్జీటిక్ గా పాడగా, కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. ఇటివలే చిత్ర యూనిట్ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ‘ధమాకా’ చిత్రం విడుదల తేదిని ప్రకటించారు. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు.



మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisement

ఇవి కూడా చదవండి



లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button