News
manikrao thackeray, మాణిక్యం ఠాగూర్ పోయే.. మాణిక్ రావు వచ్చే.. కాంగ్రెస్‌లో మరో కల్లోలం..! – manik rao thackeray is the new incharge of ts congress affairs
గతంలో తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) బాధ్యతలు చూసిన మాణిక్యం ఠాగూర్‌ను.. గోవా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా నియమించింది అధిష్టానం. అయితే.. టీ కాంగ్రెస్‌లో వాట్సాప్ గ్రూప్ గందరగోళం నెలకొంది. మాణిక్యం ఠాగూర్ వైదొలగినట్లు ప్రచారం సాగింది. కానీ.. వాట్సాప్ గ్రూప్‌లోనే ఉన్నారంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు చెప్పారు. కొద్దిరోజుల క్రితం సాంకేతిక సమస్య వల్ల ఎగ్జిట్ అయ్యారంటూ మరి కొందరు వివరించారు. అయితే.. తాజాగా.. ఇక సెలవు.. ఉంటా మరి.. అంటూ టీ కాంగ్రెస్ నేతలకు బై చెప్పారు మాణిక్కం ఠాగూర్.
తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి.. మాణిక్యం ఠాగూర్ తప్పుకున్నారని, ఏఐసీసీ (AICC) చీఫ్ ఖర్గేకు ఆయన రాజీనామా లేఖ పంపించినట్లు ప్రచారం జరిగింది. చివరికి అదే నిజమైంది. గోవా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా మాణిక్యం ఠాగూర్‌ను పంపించి.. ఆ స్థానంలో మాణిక్‌రావు థాకరేను అధిష్ఠానం నియమించింది. ఇటు.. ఠాగూర్‌ను తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న క్రమంలో.. అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే.. టీ.కాంగ్రెస్ వాట్సాప్ గ్రూప్‌ల నుంచి మాణిక్కం ఠాగూర్ లెఫ్ట్ అయ్యారు. ఈ రోజు వరకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు.