Manchu Manoj: ‘శివుని ఆజ్ఞ.. ఇద్దరి బాధ్యత నాదే’.. అందమైన ఫోటోతో మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్..
మంచు మనోజ్‌కు.. మౌనికలకు ఇది రెండో వివాహం అన్ని సంగతి తెలిసిందే. మొదట్లో స్నేహితులుగా ఉన్నారు. అప్పట్లో మౌనిక వివాహానికి మనోజ్ అతిథిగా వెళ్లారు కూడా.
డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ ఓ ఇంటివారయ్యారు. మార్చి 3న రాత్రి 8.30 నిమిషాలకు తన స్నేహితురాలు భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్నారు మనోజ్. తమ్ముడు పెళ్లి బాధ్యతలను పూర్తిగా తన భుజాలపై వేసుకుని అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నారు మంచు లక్ష్మీ. ఫిల్మ్ నగర్‌లోని ఆమె స్వగృహంలో ఇరువురి కుటుంబసభ్యులు.. అతికొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. మంచు మనోజ్‌కు.. మౌనికలకు ఇది రెండో వివాహం అన్ని సంగతి తెలిసిందే. మొదట్లో స్నేహితులుగా ఉన్నారు. అప్పట్లో మౌనిక వివాహానికి మనోజ్ అతిథిగా వెళ్లారు కూడా.
మౌనికకు ధైరవ్ రెడ్డి అనే కొడుకు కూడా ఉన్నాడు. పెళ్లి వేడుకలలో ధైరవ్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. ఇక పెళ్లి తర్వాత మనోజ్ చేసిన ఆసక్తికర ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. అందులో మౌనిక చేతులను తన చేతులోకి తీసుకున్నారు మనోజ్. వీరిద్దరి చేతులను ధైరవ్ తన చేతులతో పట్టుకున్నాడు. ఈ అందమైన ఫోటో షేర్ చేస్తూ.. శివుని ఆజ్ఞ అంటూ క్యాప్షన్ ఇచ్చారు మనోజ్. ఇక వీరిద్దరి బాధ్యత అంటూ అర్థం వచ్చేలా ఆ పోటో.. క్యాప్షన్ ఉండడంతో మంచు అభిమానులు సంతోషంగా ఫీలవుతున్నారు.
గత కొద్ది రోజులుగా మంచు మనోజ్ ప్రేమ, పెళ్లి గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే తన పెళ్లి గురించి మనోజ్ ఎప్పుడూ అధికారికంగా చెప్పలేదు. అలాగే మంచు మనోజ్ మ్యారెజ్ గురించి మంచు కుటుంబసభ్యులు ముందుగా స్పందించలేదు. మార్చి 3న పెళ్లి రోజున మనోజ్ వెడ్స్ మౌనిక అంటూ క్యాప్షన్ ఇస్తూ మౌనిక ఫోటో షేర్ చేశారు మనోజ్.
శివుని ఆజ్ఞ 🙏🏼❤️ #MWedsM #ManojWedsMounika pic.twitter.com/U5hQ5V9xqL
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 4, 2023
Advertisement
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి