Manchu Lakshmi: రెండు హృదయాలు, ఒకటే ఆత్మ.. తమ్ముడు, మరదలిపై మంచు లక్ష్మి ట్వీట్ – manchu lakshmi tweet on newly married couple manchu manoj, mounika reddy
కొత్త జంట ఫొటోతో పాటు తమ్ముడిని పెళ్లి కొడుకును చేసిన ఫొటోను మరోసారి షేర్ చేసిన మంచు లక్ష్మి ‘రెండు హృదయాలు, ఒకటే ఆత్మ.. ఈ బంధం కలకాలం నిలిచిపోతుంది’ అంటూ ట్వీట్ చేసింది. కాగా ఈ పోస్టు చూసిన ఫ్యాన్స్.. బ్యూటిఫుల్ కపుల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. నిజానికి మనోజ్.. మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకోవడం అతని తండ్రి మోహన్ బాబుకు ఇష్టం లేదనే రూమర్స్ వినిపించాయి. ఆయన పెళ్లికి హాజరు కావడం లేదని కూడా వార్తలు వ్యాపించాయి. కానీ అవన్నీ తప్పని రుజువైంది. అయితే ఈ పెళ్లికి పెద్దగా వ్యవహరించింది మాత్రం మనోజ్ సోదరి మంచు లక్ష్మి. తమ్ముడి పెళ్లిని తానే దగ్గరుండి జరిపించింది.
ఇదిలా ఉంటే, పెళ్లి తర్వాత ఆదివారం హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లిన కొత్త జంట.. స్వర్గీయ భూమా నాగిరెడ్డి దంపతుల మెమోరియల్ ఘాట్‌ను సందర్శించి నివాళులు అర్పించారు. అంతకుముందు లేట్ శోభా నాగిరెడ్డి తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డిని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. కాగా.. హైదరాబాద్ నుంచి కర్నూలు చేరుకున్న మంచు మనోజ్ జంటకు టోల్ గేట్ వద్ద అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది.
ఇక మనోజ్, మౌనికా రెడ్డి.. ఇద్దరికి కూడా ఇది రెండో పెళ్లి అని తెలిసిందే. 2015లో ప్రణతి రెడ్డిని పెళ్లి చేసుకున్న మనోజ్.. 2109లో ఆమెతో విడిపోయాడు. ఆ తర్వాత మౌనికా రెడ్డికి దగ్గరయ్యారు. అలాగే మౌనికకు కూడా 2016లో బెంగళూరుకు చెందిన బిజినెస్ మ్యాన్ గణేష్ రెడ్డితో వివాహం జరిగింది. ఒక కొడుకు పుట్టిన తర్వాత మనస్పర్థలతో వాళ్లిద్దరూ విడిపోయారు. అయితే గతేడాది సీతాఫల్ మండిలోని వినాయక మంటపానికి మనోజ్, మౌనికా రెడ్డి కలిసి రావడంతో ఇద్దరి మధ్య రిలేషన్ గురించిన రూమర్స్ మొదలయ్యాయి. కానీ ఎవరూ అధికారికంగా వెల్లడించలేదు. ఎట్టకేలకు మనోజ్, మౌనిక శుక్రవారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
- Read Latest Tollywood Updates and Telugu News