News

Manasichi Choodu Mahesh, Keerthi Bhat Boyfriend: బిగ్ బాస్ కీర్తితో ఆది ప్రేమ..పెళ్లి? మేం రొమాంటిక్ కపుల్.. మా ఇద్దరి మధ్య రిలేషన్ ఇదే: ‘మనసిచ్చి చూడు’ హీరో మహేష్ – manasichi choodu aadi about marriage and relation with bigg boss 6 keerthi


భాను కోసం ఆది బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాడు. లక్షలాది మంది ప్రేక్షకుల తరుపున నీకోసం నేనొచ్చా.. నువ్ ఒంటరివి కాదు.. నీకు నేనున్నా నీకు లక్షలాది మంది జనం అభిమానం ఉంది. నువ్ టైటిల్ గెలిచిరా అంటూ ధైర్యం చెప్పాడు. అంతేకాదు.. ఆమె కోసం రెడ్ రోజ్ తీసుకుని వెళ్లి.. మోకాళ్లపై కూర్చుని మరీ ప్రపోజ్ చేస్తున్నట్టుగా రెడ్ రోజ్ ఇచ్చాడు. ఈ రొమాంటిక్ జంటను చూసి.. వీళ్లిద్దరూ స్క్రీన్‌పై మాత్రమే రొమాంటిక్ కపుల్‌నా లేదంటే ఆఫ్ స్క్రీన్‌లోనూ రొమాంటిక్ జోడీనా అని ప్రశ్నలు మొదలయ్యాయి.

మనసిచ్చి చూడు సీరియల్‌లో భాను, ఆదిల జోడీకి బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఇద్దరి ఈడు జోడు బాగా కుదరడంతో ఈ సీరియల్‌ హిట్ అయ్యింది. ఈ ఇద్దరికీ మంచి పేరు వచ్చింది. భాను‌గా కీర్తి భట్ నటిస్తే.. ఆదిగా మహేష్ బాబు కాళిదాసు నటించారు. అయితే వీళ్ల పెయిర్ బాగా పండటంతో ఈ సీరియల్ తరువాత నుంచి వీళ్లు పేర్లు భాను, ఆదిలుగా మారాయి. నిజానికి కీర్తి.. కార్తీకదీపం సీరియల్ నెక్స్ట్ జనరేషన్ కథలో హిమగా వచ్చినప్పటికీ.. చాలామందికి ఇంకా భానుగానే ఆమెను గుర్తుపెట్టుకున్నారు.

అయితే కీర్తి విషాధగాథ అందరికీ తెలిసిందే. ఆమె ఎవరూ లేని అనాధ. ఫ్యామిలీ మొత్తం యాక్సిడెంట్‌లో చనిపోగా.. ఆమె ఒక్కరే ప్రాణాలను దక్కించుకుని కొన్నాళ్లు పాటు కోమాలోకి వెళ్లింది. అయితే తాను అనాధగా ఉండకూడదని మరో అనాధని దత్తత తీసుకుని పెంచుకుంటుండగా.. ఆ చిన్నారి కూడా అనారోగ్యంతో చనిపోయింది. ఇప్పుడు కీర్తి ఒంటరిగానే ఉంటుంది.

కాగా.. ఆదితో కీర్తికి మంచి బాండింగ్ ఉంది. ఇక కీర్తి కోసం ఆది.. ‘ఏమండోయ్ భానుగారూ’ అంటూ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లడంతో.. వీళ్లిద్దరూ నిజంగానే కాబోతున్న భార్యభర్తలు అనే పుకార్లు జోరందుకున్నాయి. మరి నిజంగానే వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారా? లేదంటే అవి పుకార్లు మాత్రమేనా? వీళ్లు లవ్‌లో ఉన్నారా? లేదన్న విషయాలపై చాలా తెలివిగా సమాధానాలు ఇచ్చాడు మహేష్ అలియాస్ ఆది.

‘మా ఇద్దర్నీ రొమాంటిక్ కపుల్ అని అంటారు.. అది నిజమే.. కాకపోతే.. నేను పెళ్లి చేసుకుంటే నా వైఫ్‌తో రొమాంటిక్.. తను పెళ్లి చేసుకుంటే తన హజ్బెండ్‌తో రొమాంటిక్’ అని అన్నాడు.. హో అవునా.. అయితే ఆమె హజ్బెండ్‌ మహేషా అంటే.. ‘ఏమో అయ్యి ఉండొచ్చు.. నాకేం తెలుసు.. మహేష్ అనేవాడు నేనొక్కడ్నే కాదు కదా.. చాలామంది ఉన్నారుగా’ అని సమాధానం దాటవేశాడు.

కీర్తితో రిలేషన్ గురించి మాట్లాడుతూ.. ‘మమ్మల్ని క్యూట్ కపుల్.. రియల్ కపుల్.. అని అనుకోండి తప్పులేదు.. కానీ మేం ఇద్దరం ఎప్పుడు బయటకలిసింది లేదు. కలిసి ఉన్నది లేదు. మా ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుకుంటారు. భాను-ఆది అనేవాళ్లు రియల్ లైఫ్ కపుల్ అని జనం ఫిక్స్ అయిపోయారు. ఎంతలా అంటే.. ఓ రోజు షూటింగ్‌లో వేరే అమ్మాయితో షాట్ పెట్టారు.. నేను ఆ అమ్మాయికి దగ్గరయ్యే సీన్. అది చూసిన ఒకావిడ.. మాకు ఇదేం నచ్చడం లేదు.. ఇదేం బాలేదు అంటూ చిరాకుపడింది. ఇది యాక్టింగ్ అండీ అని అంటే.. యాక్టింగ్ అయినా మీరు భానుతోనే చేయాలి.. వేరే అమ్మాయిలతో చేయకూడదని అన్నది. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది.. ఆమె చాలా ఎక్స్ ట్రీమ్ అనిపించింది. మమ్మల్ని రియల్ కపుల్ అనుకుంటున్నారు. అది ఒక రకంగా ఆనందాన్ని ఇస్తుంది కానీ.. ఎక్స్ ట్రీం కాకూడదు. నేను బయటకు వెళ్లినా.. చాలామంది కీర్తి గురించి అడుగుతారు.. ఎందుకంటే మమ్మల్ని అంత ఇష్టపడ్డారు కాబట్టే’ అని చెప్పుకొచ్చాడు మహేష్.

Read more Cinema News and Telugu News, TV News

Advertisement

Related Articles

Back to top button