Entertainment

Maama Mascheendra Trailer : మహేష్ చేతుల మీదుగా ‘మామా మశ్చీంద్ర’ ట్రైలర్.. సుధీర్ బాబు కొత్త కథ ఆసక్తికరం..


టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించేందుకు ముందుంటున్నారు టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు. ప్రతి సినిమాను సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ.. నటనతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా మామా మశ్చీంద్రా. ఇందులో సుధీర్ బాబు ట్రిపుల్ రోల్ చేస్తున్నారు. గతంలో ఈ మూవీ నుంచి నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 6న అడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యింది. ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. మరోవైపు సినిమా ప్రచార కార్యక్రమాలు స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు.

ఇక ఇందులో ట్రిపుల్ రోల్ పోషిస్తున్న సుధీర్ బాబు.. ఒకటి ఓల్డ్ గెటప్ కాగా.. మరో రెండు చూస్తే.. ఒకటి యంగ్ అండ్ స్టైలీష్.. మరొక పాత్రలో లావుగా కనిపిస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే.. మామ, మేనల్లుళ్ల మధ్య జరిగే రివెంజ్ డ్రామా స్టోరీ అని తెలుస్తోంది. అల్లుళ్లకు మేనమామ పోలిక రావడం.. తండ్రి రూపంతో ఉన్న హీరోలతో కూతుర్లు ప్రేమలో పడడం.. తర్వాత మేనమామకు, అల్లుళ్లకు మధ్య ఉన్న రివెంజ్ ఏంటీ ?.. ఎలాంటి పరిస్థితులు వచ్చాయనేది చిత్రం.

ఈ సినిమాకు హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటివరకు నటుడిగా.. రైటర్ గా గుర్తింపు సంపాదించుకున్న హర్షవర్దన్ ఇప్పుడు మామా మశ్చీంద్ర సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇందులో ఈషా రెబ్బా, మిర్నాలి రవి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇందులో రాజీవ్ కనకాల, అభినయ, అజయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Advertisement

Related Articles

Back to top button