News

Mahabali Vs Ranadheera,Bigg Boss 7 Telugu Episode 11: ‘మాయాస్త్ర’ విజేతలుగా రణధీర.. సొచ్చు తెలివితో బొక్కబోర్లా పడ్డ మహా‘బలి’ – nagarjuna telugu bigg boss season 7 september 13 written updates mahabali vs ranadheera task


ఆట ఎప్పుడూ గెలవడం కోసం ఆడాలి.. ఎదుటి వాడ్ని తొక్కేసి గెలవాలనుకుంటే రిజల్ట్ ఇదిగో ‘మహబలి’ టీంలాగే ఉంటుంది. వెధవ సొచ్చు తెలివి తేటలతో బొక్కబోర్లా పడాల్సి ఉంటుంది. బిగ్ బాస్ హౌస్‌లో రణధీర, మహాబలి టీంల మధ్య మాయాస్త్ర కోసం బిగ్ బాస్‌ టాస్క్‌లు ఇస్తున్నారు. మొదటి దశలో రణధీర టీం సభ్యులు ( శివాజీ, అమర్‌దీప్, ప్రియాంక, ప్రిన్స్ యావర్, శోభాశెట్టి, షకీలా) విజయం సాధించి.. మాయాస్త్ర కీ సంపాదించారు.

అయితే ఆ కీని కొట్టేయడానికి మహాబలి టీం సభ్యులు (శుభశ్రీ, రతిక, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, దామిని) దొంగనాటకాలు ఆడటంతో.. శివాజీ వాళ్లకి చుక్కలు చూపించాడు. దామిని, శుభ శ్రీ‌లు తాళం చెవి కొట్టేయడానికి దొంగనాటకాలు ఆడుతుండటంతో.. శివాజీ ముందే పసిగట్టి.. ‘మీరు మీ ఓవరాక్షన్.. మూసుకుని పడుకోండి.. మీరు ఆడేది శివాజీతో.. ఈ తాళం తీయడం మీ వల్ల కాదు.. ఏం యాక్టింగ్ చేస్తున్నారు.. ఎవడు చెప్పాడు మీకు తాళం కొట్టేయొచ్చుని ఆ డాక్టర్ గాడు చెప్పాడా? మీరు మీ పెర్ఫామెన్స్.. ఆ తాళం చేరాల్సిన చోటికి వెళ్లిపోయింది సుబ్బూ’ అంటూ శుభ శ్రీ గాలి తీసేశాడు శివాజీ.

ఈ తరువాత శివాజీ నిద్రలోకి వెళ్తుండగా.. మన రితి పాప మాటు వేసి మెల్లగా శివాజీ కప్పుకున్న దుప్పటిని లాగడానికి ట్రై చేసింది. ఏయ్ అని శివాజీ అరవడంతో.. ఒక్కసారిగా తుళ్లిపడింది రతిపాప. ఇక్కడేం లేదు పిచ్చిదానా పోపో అని అన్నాడు శివాజీ. మీకు క్లూ ఇస్తా.. అంటూ రకరకాల క్లూలు ఇచ్చి రతిక పాపతో ఆడుకున్నాడు శివాజీ. ఆ క్లూలు నిజమే అని నమ్మేసింది పిచ్చి రతిక.

శివాజీ బిగ్ బాస్

మహాబలి టీం సభ్యులు ఆటలో ఎలా గెలవాలో ఆలోచించడం మానేసి.. గెలిచిన వాళ్ల దగ్గర నుంచి ఎలా కొట్టేయాలన్నదానిపైనే ఫోకస్ పెట్టి బొక్కబోర్లా పడ్డారు. రణధీర టీం గెలవగానే.. ఈ కీ అమ్మాయిలు లాక్కుని వెళ్లిపోండి.. మేం వాళ్లని అడ్డుకుంటాం అంటూ పనికి మాలిన సలహా ఇచ్చాడు టేస్టీ తేజా.

రణ ధీర టీం

నీతి న్యాయం గురించి బాగా తెలిసిన మన లాయర్ పాప.. శుభ శ్రీ రాయగురు.. తాళం చెవి దొరక్కపోయేసరికి సందీప్ పవరాస్త్రని నొక్కేసి ఫ్యాంట్‌లో పెట్టుకుంది పరమ దరిద్రంగా. సప్త సముద్రాలు దాటిన వీరుడైనా ఆదమరిస్తే పిల్ల కాలువలో మునగాల్సిందే. ఆ వీరుడు ఎవరు? ముంచింది ఎవరు? మునిగింది ఏంటి? చెప్పుకోండి చూద్దాం అంటూ ఇంటి సభ్యులకు ఫజిల్ ఇచ్చారు బిగ్ బాస్. అయితే సందీప్.. పవరాస్త్ర అంటూ శుభశ్రీ-గౌతమ్‌లు గుసగుసలాడారు.

Advertisement

శివాజీ అయితే మహాబలి టీంని ఆటాడుకున్నాడు. తాళం దాస్తున్నట్టుగా నటించేవాడు. అదే నిజం అనుకుని పిచ్చికుక్కల్లా వెతుక్కునే వాళ్లు మహాబలి టీం వాళ్లు. పల్లవి ప్రశాంత్‌ని కూడా అలాగే ముప్పు తిప్పలు పెట్టాడు. గ్రీన్ మ్యాట్ కింద ఏదో దాస్తున్నట్టుగా యాక్ట్ చేశాడు శివాజీ. అదే చాటుగా చూసిన ప్రశాంత్ పిచ్చి కుక్కలా వెతుక్కున్నాడు. అది తన టీం సభ్యులకు చూపించిన శివాజీ.. వీళ్లకు తలో టాస్క్ ఇచ్చా.. ప్రశాంత్ గాడికి గడ్డి టాస్క్ ఇచ్చాను.. వాడ్ని చూడండి ఎలా చూస్తున్నాడో అంటూ ముప్పు తిప్పలు పెట్టేశాడు శివాజీ.

మాయాస్త్ర గెలవడానికి ‘మలుపులో ఉంది గెలుపు’ అంటూ రెండో ఛాలెంజ్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో గెలిస్తే మాయాస్త్ర గెలవడానికి మరో కీ లభిస్తుందని చెప్పారు. అయితే ఈ టాస్క్‌లోకూడా రణధీర టీం సభ్యులే గెలవడంతో.. వాళ్లని యాక్టివిటీ ఏరియాకి పిలిచి.. మాయాస్త్ర‌తో సర్ ప్రైజ్ చేశారు బిగ్ బాస్. మొత్తానికి నేటి టాస్క్‌లో మరోసారి హైలైట్ అయ్యాడు హీరో శివాజీ. మహాబలి టీం సభ్యుల్ని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. ట్విస్ట్ ఏంటంటే.. ‘మాయాస్త్ర’ టాస్క్‌కి సంచాలకుడిగా ఉన్న సందీప్.. పవరాస్త్రని నొక్కేసింది వకీల్ పాప శుభ శ్రీ రాయగురు.

Related Articles

Back to top button