News

Maduranagar Robbery,వాస్తునిపుణుడి ఇంట్లో భారీ చోరీ.. రూ.3.93 కోట్ల డబ్బు, అరకేజీ బంగారం అపహరణ – thief robbed almost 4 crore money and gold in architectural expert house in hyderabad


హైదరాబాద్ మధురానగర్‌ పోలీసు స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఓ వాస్తునిపుణుడి ఇంట్లో రూ. 3.93 కోట్ల డబ్బు, 450 గ్రాముల బంగారం అపహరణకు గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీఎల్‌ఎన్ చౌదరి అనే వ్యక్తి వాస్తుశాస్త్ర నిపుణుడు. సారథి స్డూడియో వెనుక ఉన్న ఓ ఇంట్లోని పెంట్ హౌస్‌లో గత 25 ఏళ్లుగా అతడు అద్దెకు ఉంటున్నాడు. అయితే ఇటీవల ఇంటి యజమాని అతడిని ఖాళీ చేయాలని చెప్పాడు.

దీంతో నగరంలో తానే ఇళ్లు కొనుక్కొవాలని చౌదరి నిర్ణయం తీసుకున్నాడు. అందుకు తాను దాచుకున్న రూ. 3.93 కోట్ల నగదు, 450 గ్రాముల బంగారం కడ్డీలను సిద్ధం చేసుకున్నాడు. ఇక ఇంటి కొనుగోలుకు చౌదరి ప్రయత్నాలు మెుదలుపెట్టాడు. డబ్బు బంగారాన్ని బ్యాంకు లాకర్‌లో కాకుండా తన ఇంట్లోని పరుపు కింద మూడు సూటుకేసుల్లో దాచి పెట్టాడు. ఈనెల 12న చౌదరి పని నిమిత్తం ఉదయం బయటికి వెళ్లి రాత్రి 11.45 గంటలకు తిరిగి వచ్చాడు.

వచ్చి చూసేసరికి పెంట్‌హౌస్‌ మెట్లు, తలుపులు, గోడలు దెబ్బతిని ఉండటాన్ని గమనించాడు. లోపలికి వెళ్లి చూడగా.. పరుపు కింద ఉన్న డబ్బు, బంగారు, ఇంట్లోని 3 లాప్‌టాప్‌లు, 3 సెల్‌ఫోన్లు, విలువైన డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు బాధితుడు మధురానగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాగా తెలిసిన వారే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే విచారణ చేపట్టారు.

Related Articles

Back to top button