News
Madhapur Gun Firing, హైదరాబాద్: మాదాపూర్‌లో కాల్పుల కలకం.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు – one shot dead in gun firing at madhapur hyderabad
Madhapur Gun Firing కలకలం రేగింది. ఇస్మాయిల్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులు జరిపారు.. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
ప్రధానాంశాలు:
- మాదాపూర్‌లో కాల్పుల కలకలంరేగింది
- రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇస్మాయిల్ మృతి
- మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది
ఇస్మాయిల్‌పై కాల్పులు జరిపింది సాదిక్, ముజాహిద్, జిలానిగా పోలీసులు గుర్తించారు. పాతకక్షలతోనే ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇస్మాయిల్‌పై ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. భూ వివాదం కారణంగానే కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. మాదాపూర్‌లో కాల్పులు జరగ్గా.. డెడ్‌బాడీని తీసుకెళ్లి జూబ్లీహిల్స్ నీరూస్ దగ్గర దగ్గర వదిలివెళ్లారు. ఈ కాల్పుల వ్యవహారంలో సాదిక్ అనే వ్యక్తి ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఓ భూ వివాదంపై చర్చించేందుకు అక్కడికి వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సమీప నగరాల వార్తలు
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి.
Web Title : Telugu News from Samayam Telugu, TIL Network