Made In India Iphone 15,iPhone 15: అమెరికా, దుబాయ్ కంటే మన ‘ఐఫోన్’ కాస్ట్‌లీ.. 50 శాతం ఎక్కువ.. అసలెందుకీ తేడా అంటే? – made in india apple iphone 15 to cost more in india than us, dubai
ఇక ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ బేస్ మోడల్ చూస్తే ధర భారత్‌లో మరీ ఎక్కువగా ఉంది. ఇది అమెరికాలో 1199 డాలర్లు అంటే భారత కరెన్సీలో చూస్తే రూ. 99 వేలు అవుతుంది. ఇక భారత్‌లో ఈ మోడల్ రేటు ఏకంగా రూ.1.59 లక్షలుగా ఉంది. అంటే ఇక్కడ ఏకంగా 50 శాతం అధికంగా ఉండటం చూసి షాకవుతున్నారు. దుబాయ్‌లో ఈ మోడల్ ధర .. భారత కరెన్సీలో చూస్తే రూ.1.15 లక్షలుగా ఉంది.
ఒక్క ఐడియా ఇస్తే చాలు.. రూ. 10 లక్షలు గెల్చుకోవచ్చు.. ఈ దిగ్గజ సంస్థ అదిరిపోయే ఆఫర్.. ఎలా అప్లై చేసుకోవాలి?
దుమ్మురేపిన టాటా గ్రూప్ స్టాక్.. నెల రోజుల్లోనే ఆమెకు రూ.1390 కోట్ల లాభం.. రోజూ ముందుకే..
తేడా ఎందుకంటే?
ప్రస్తుతం భారత్‌లో ఐఫోన్ 15ను .. ఇక్కడి ఫాక్స్‌కాన్ సంస్థ తయారు చేస్తోంది. ఐఫోన్ 15 ప్లస్‌ను కూడా త్వరలో దేశీయంగానే తయారు చేయనుంది. ఇక ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడల్స్ మాత్రం మనకు దిగుమతి అవుతాయి. ముందుగా ఐఫోన్ 15 గురించి మాట్లాడుకుంటే.. దేశీయంగా తయారైనప్పటికీ సంబంధిత ఉపకరణాలను మాత్రం ఫాక్స్‌కాన్ సంస్థ దిగుమతి చేసుకుంటుంది. దీంతోనే వాటికి దిగుమతి సుంకం చెల్లించాల్సి ఉంటుంది.
డిస్‌ప్లే, ప్రాసెసర్, డయోడ్స్, ట్రాన్సిస్టర్స్ వంటి పార్టులకు ఈ దిగుమతి సుంకం వర్తిస్తుంది. వీటితో తయారైన యాపిల్ ఫోన్‌కు 18 శాతం జీఎస్టీ అదనంగా ఉంటుంది. యాపిల్ ఐఫోన్ ప్రో మోడల్స్ విషయానికి వస్తే.. లగ్జరీ కార్స్ మాదిరిగా వీటికి 22 శాతం దిగుమతి సుంకం, 2 శాతం సోషల్ వెల్ఫేర్ సర్‌ఛార్జీని కూడా ప్రభుత్వం విధిస్తుంది. దీనికి 18 శాతం జీఎస్టీ మళ్లీ అదనం. ఇలా మొత్తంగా విదేశాల్లో తయారై దిగుమతి అయిన ఐఫోన్ మోడళ్లకు దాదాపు 40 శాతం పన్ను రూపంలో చెల్లించాలి. అందుకే ఈ ప్రో మోడళ్ల ధరలు మరింత ఎక్కువగా ఉంటాయని గ్రహించొచ్చు.
Real Estate: వామ్మో ఎకరం రూ.236 కోట్లు.. రికార్డులన్నీ బద్దలు.. 22 ఎకరాలకు రూ.5200 కోట్లతో డీల్!
Tech Layoffs: ఉద్యోగులకు షాకిచ్చిన టెక్ దిగ్గజం.. మరోసారి లేఆఫ్స్.. అప్పుడు 12 వేల మంది అవుట్.. మరి ఇప్పుడు?
Read Latest Business News and Telugu News