News

LR Eeshwari: అదీ ఒక పాటేనా.. ‘ఊ అంటావా’ సాంగ్‌పై సీనియర్ సింగర్ కామెంట్స్ – senior singer lr eeshwari criticises ‘oo antava song’


టాలీవుడ్ ప్రేక్షకులకు సీనియర్ సింగర్ ఎల్ ఆర్ ఈశ్వరి (LR Eeshwari) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హస్కీ వాయిస్‌ (Huski Voice) తనకు దేవుడిచ్చిన వరం కాగా.. ‘మసక మసక చీకటిలో, భలే భలే మగాడివోయ్, తీస్కో కోకా కోలా’ వంటి పాటలు ఇప్పటికీ ఎక్కడో ఓ చోట వినిపిస్తున్నాయంటే అది ఆమె వాయిస్‌‌లోని గొప్పతనమే. ఇలా అనేక భాషా చిత్రాల్లోని పాటలకు తన గొంతుతో ప్రాణం పోసిన ఈ సింగర్.. తాజాగా ‘ఊ అంటావా ఉఊ అంటావా’ (Oo Antava song) అనే ఐటెం సాంగ్‌పై చేసిన విమర్శలు వైరల్ అవుతున్నాయి.

‘పుష్ప’ (Pushpa) చిత్రంలోని ‘ఊ అంటావా’ సాంగ్ తెలుగు వెర్షన్‌ను ప్రముఖ సింగర్ మంగ్లీ చెల్లెలు ఇంద్రావతి చౌహాన్ (Indravathi Chauhan) పాడింది. నిజానికి ఈ పాట దేశమంతటినీ ఉర్రూతలూగించింది. కానీ సీనియర్ సింగర్ ఎల్‌ఆర్ ఈశ్వరికి మాత్రం నచ్చలేదట. ప్రజెంట్ జనరేషన్ సాంగ్స్‌కు తాను అభిమానిని కాదని లేటెస్ట్ ఇంటర్వ్యూలో పేర్కొన్న ఆమె.. ‘ఊ అంటావా’ సాంగ్‌ను అసలు పాటగానే పరిగణించలేదు. అది కూడా పాటేనా? అంటూ కామెంట్ చేసింది. కంపోజిషన్‌తో పాటు సింగింగ్.. చివరి వరకు ఒకే పిచ్‌పై ఉంటుందని వ్యా్ఖ్యానించింది. అయితే సింగర్స్ తమకు సూచించిన విధంగానే పాడతారు కాబట్టి పర్యవేక్షించాల్సిన బాధ్యత మ్యూజిక్ డైరెక్టర్స్‌దేనని అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఆ పాట తనకు ఇచ్చి ఉంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉండేదని చెప్పుకొచ్చారు.
Jr NTR: టైగర్ బొమ్మతో యంగ్ టైగర్.. కాలిఫోర్నియాలో క్రేజీ లుక్స్
ఈ సందర్భంగానే నేటి తరం ఫిలిం మేకర్స్, సాంకేతిక నిపుణులను ఎల్ ఆర్ ఈశ్వరి విమర్శించారు. అప్పట్లో సీనియర్స్‌తో కలిసి పనిచేసినందు వల్లే తమ పాటలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్నాయన్న ఈశ్వరి.. ఆ రోజుల్లో ఒక్కో సినిమా 100, 200 రోజులు నడిచేదని.. ఇప్పుడు మాత్రం 10 రోజులు నడవడమే పెద్ద విషయంగా మారిందని తెలిపారు.

ఇక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రంలో ‘ఊ అంటావా’ సాంగ్‌ను స్టార్ హీరోయిన్ సమంతపై చిత్రీకరించిన విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేయగా.. రిలీజ్ టైమ్‌లోనూ ఈ పాట కొంచెం కాంట్రవర్సీకి కారణమైంది. మహిళల పట్ల మగాళ్ల బుద్ధిని విమర్శిస్తూ చంద్రబోస్ రాసిన ఈ సాంగ్‌కు కౌంటర్‌గా అనేక వెర్షన్లు యూట్యూబ్‌లో తెగ వైరల్ అయ్యాయి.
ప్రస్తుతం ‘పుష్ప’ చిత్రానికి సీక్వెల్‌గా ‘పుష్ప2’ తెరకెక్కుతోంది. మొదటి పార్ట్ కంటే భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా.. ఇందులో కూడా ఒక ఐటెం సాంగ్ ఉండే అవకాశం ఉంది.

  • Read Latest Tollywood Updates and Telugu News

Related Articles

Back to top button