News

Love Couple Suicide Attempt,ప్రేమ పెళ్లికి నిరాకరణ: నిన్న ప్రియుడు.. నేడు ప్రియురాలు ఆత్మహత్యాయత్నం – love couple suicide attempt in gudur mahabubabad district


Love Couple: మహబూబాబాద్ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. నిన్న ప్రియుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. నేడు ప్రియురాలు పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చేరింది. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాద్ జిల్లా గూడూరుకు చెందిన యువతి కార్తీక్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. అయితే పెళ్లి చేసుకోవాలని యువతి కార్తీక్‌ను అడగ్గా.. అతడు అందుకు నిరాకరించాడు.

దీంతో యువతి ఆదివారం కార్తీక్ ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. దీంతో ఆందోళన చెందిన కార్తీక్ సోమవారం పురగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో కుటుంబసభ్యులు అతడిని నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రియుడి ఆత్మహత్యాయత్నాన్ని తట్టుకోలేని యువతి తాను కూడా చనిపోవాలని నిర్ణయం తీసుకుంది. ఎలుకల ముందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు ఆమెను గూడూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు అక్కడ చికిత్స అందుతోంది.

ఆత్మహత్యాయత్నానికి ముందు యువతి సూసైడ్ లెటర్ రాసింది. కార్తీక్ లేని జీవితం నాకొద్దు. కార్తీక్ నేను ప్రేమించుకున్నాం. కలిసి జీవించాలని అనుకున్నాం. తక్కుక కులం కావటంతో కార్తీక్ తల్లిదండ్రులు మా పెళ్లికి ఒప్పుకోలేదు. నన్ను పెళ్లి చేసుకుంటే చనిపోతామని కార్తీక్‌ను వాళ్ల అమ్మ, నాన్న బెదిరించారు. మా పెళ్లికి కార్తీక్ మేనమామలు సురేందర్, ఉపేందర్, శ్రీను, శ్రీశైలం అడ్డు తగిలారు. నా చావుకు వీరే కారణం అంటూ యవతి సూసైడ్ నోట్ రాసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాధిత యువతి నుంచి వివరాలు సేకరించారు.

  • Read More Telangana News And Telugu News

Related Articles

Back to top button