News

lorry hit a hen, Road Accident: కోడిని ఢీకొట్టిన లారీ.. స్పాట్ డెడ్.. గ్రామస్థుల ఆందోళన..! – a hen dead in spot after hit by lorry in kumuram bheem asifabad


Authored by Ramprasad | Samayam Telugu | Updated: 24 Nov 2022, 4:10 pm

Road Accident: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం కేంద్రంలో పోచమ్మ వాడ బాబా సాగర్ గ్రామంలో ఓ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రధాన రహదారిపై కంకర లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ వేగంగా వచ్చి ఓ కోడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కోడి.. అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం తెలుసుకుని గ్రామస్థులు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. కోడి చచ్చిపోతే ఇంత రచ్చ ఏంటీ.. ఇదెక్కడి విడ్డూరమని చులకనగా తీసేయకండీ.. వాళ్లేందుకు ఆందోళన చేస్తున్నారో తెలిస్తే మీరు కూడా వాళ్లకే సపోర్ట్ చేస్తారు..!

 

ప్రధానాంశాలు:

  • ఆసిఫాబాద్ జిల్లాలో లారీ ఢీకొని కోడి మృతి
  • విషయం తెలుసుకుని ఆందోళనకు దిగిన గ్రామస్థులు
  • ప్రధాన రహదారిపై పెద్దఎత్తున నిలిచిపోయిన లారీలు
Road Accident:రహదారి వెంట కంకర లోడుతో వెళ్తున్న ఓ లారీ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆ లారీని పట్టుకున్నారు. న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. స్థానికుల ఆందోళనతో.. ఆ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అది లారీలు పెద్దఎత్తున రాకపోకలు నిర్వహించే రూట్ కావటంతో.. రహదారిపై కిలోమీటర్ మేర ట్రక్కులు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అయితే.. ఇంతకు ఆ పోయిన నిండు ప్రాణం ఎవరిదనుకుంటున్నారు..? ఇంకెవరిది మనిషిదే అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. ఇదంతా.. ఓ కోడి కోసం జరిగింది. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజమండీ బాబు.

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం కేంద్రంలో పోచమ్మ వాడ బాబా సాగర్ గ్రామంలో ప్రధాన రహదారిపై కంకర లోడుతో లారీలు వెళుతున్నాయి. అయితే.. అదే సమయంలో ధంద్రే బండయ్యకు చెందిన ఓ కోడి అటుగా వెళ్లింది. అనుకోకుండా.. విధి వక్రించి ఆ కోడిని లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కోడి.. తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న ఆ కోడి యజమానులతో పాటు గ్రామస్థులు.. ఆ కోడి ప్రాణం తీసిన లారీని పట్టుకున్నారు. న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. వీళ్ల ఆందోళనతో ప్రధాన రహదారిపై రాకపోకలు సాగిస్తున్న లారీలు పెద్దఎత్తున నిలిచిపోయాయి.

ఈ ఘటన వినడానికి వింతగా ఉన్నా.. జరిగిందయితే.. ఇదే మరి. ఓ మనిషి ప్రాణం పోయినా పట్టించుకోకుండా వెళ్లిపోతున్న ఈ రోజుల్లో.. కేవలం ఓ కోడి కోసం ఇంత రచ్చ అవసరమా అనుకుంటున్నారు కదా. అదేంటండీ.. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. మనిషి ప్రాణం వేరు.. కోడి ప్రాణం వేరా..? ప్రమాదంలో పోయింది మాత్రం ఓ నిండు ప్రాణం. దాన్ని తిరిగి తీసుకురాగలమా.. న్యాయం కావాల్సిందే.. అంటూ భీష్మించుకు కూర్చుకున్నారు గ్రామస్థులు.

  • మైనర్ బాలుడిని లైంగికంగా వేధించిన ట్యూషన్ టీచర్‌కు 10 ఏళ్ల జైలు

  • హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. ప్రారంభానికి సిద్ధమైన మరో ఫ్లైఓవర్
  • ట్రాఫిక్ పోలీసుల కొత్త రూల్స్.. ఇకనుంచి వాళ్లకు మాత్రం బ్యాండ్ బాజానే..!
  • Read More Telangana News and Telugu News


సమీప నగరాల వార్తలు

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Advertisement

Related Articles

Back to top button