Lokesh Kanagaraj: లియోకు సీక్వెల్, ప్రీక్వెల్ ఉంటాయా ?? యూనివర్స్ టైమ్ లైన్‌ను డీకోడ్ చేస్తున్నారు ఫ్యాన్స్
విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ లియో. దసర కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా… వసూళ్ల పరంగా రికార్డ్‌లు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈసినిమాను ఎల్సీయూలో భాగం చేస్తూ లోకి యూనివర్స్ టైమ్ లైన్‌ను డీకోడ్ చేస్తున్నారు ఫ్యాన్స్.
కోలీవుడ్ ఇండస్ట్రీలో జర్నీ స్టార్ట్ చేసి ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారిన యంగ్ టెక్నీషియన్ లోకేష్ కనగరాజ్. ఖైదీ సినిమా నుంచి మొదలు పెట్టి తన ప్రతీ మూవీని మరో మూవీతో కనెక్ట్ చేస్తూ వస్తున్న లోకేష్, వెండితెర మీద ఓ గ్యాంగ్‌స్టర్ యూనివర్స్‌ను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా లియో రిలీజ్ తరువాత ఈ యూనివర్స్‌కు సంబంధించిన టైమ్ లైన్‌ను డీకోడ్ చేస్తూ కొత్త థియరీని తెర మీదకు తీసువచ్చారు ఫ్యాన్స్.
ఖైదీ, విక్రమ్, లియో సినిమాల్లోని క్యారెక్టర్స్‌ను కనెక్ట్ చేస్తూ వాటి టైమ్స్ లైన్స్‌ను డీకోడ్ చేశారు. కథ ప్రకారం ఖైదీ సినిమా 2019లో జరుగుతుంది. అంతకు ముందు పదేళ్ల పాటు ఢిల్లీ జైల్లో ఉన్నాడు. అంటే 2009కి ముందు ఢిల్లీ జీవితంలో జరిగిన సంఘటన నేపథ్యంలోనే ఖైదీ 2ను ప్లాన్ చేస్తున్నారన్న టాక్ ఉంది.
విక్రమ్ కథ కూడా ఖైదీ కథకు ప్యారలల్‌గా జరుగుతున్నట్టుగానే చూపించారు. అంటే విక్రమ్ స్టోరి టైమ్ పీరియడ్ కూడా 2019లో టైమ్‌లోనే ఉంటుంది. ఆ సినిమా క్లైమాక్స్‌లో రోలెక్స్ ఎంట్రీ ఇచ్చారు కాబట్టి, రోలెక్స్ కథ కూడా ఢిల్లీ, విక్రమ్ క్యారెక్టర్లకు ప్యారలల్గానే ట్రావెల్ చేస్తుందన్న కంక్లూజన్‌కు వచ్చేశారు.
లియో 2021లో జరగుతుంది. ఈ సినిమా క్లైమాక్స్‌లో ఆంటోని దాస్, హెరాల్డ్ దాస్ చనిపోవటంతో లియో కథ ముగుస్తుంది. కానీ ఇప్పుడు ఈ కథను ఎల్సీయూకి కనెక్ట్ చేస్తూ రోలెక్స్ క్యారెక్టర్ హెరాల్డ్ దాస్‌కు కొడుకు అన్న ప్రచారం మొదలు పెట్టారు. అప్‌కమింగ్ లైనప్‌లో ఖైదీ 2, రోలెక్స్, విక్రమ్ 2 సినిమాలతో మరిన్ని కొత్త క్యారెక్టర్స్‌ను ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు లోకేష్.