News
liquor queen kavitha, కవిత ఎపిసోడ్‌లో కీలక పరిణామం.. ఈడీకి మరో లేఖ.. ‘అందులో ఆంతర్యం ఏంటీ..?’ – brs mlc kavitha written one more letter to ed about inquiry in delhi liquor scam case
ఒక సామాజిక కార్యకర్తగా ఒక వారం ముందే నా కార్యక్రమాలు ఖరారయ్యాయనీ, కాబట్టి 11వ తేదీన విచారణకు హాజరవుతానని ఈడీకి కవిత తెలియజేశారు. రాజకీయ కక్షలో భాగంగానే ఇదంతా చేస్తున్నట్లు స్పష్టమవుతుందన్నారు. దేశ పౌరురాలిగా ఒక మహిళగా చట్టపరమైనటువంటి అన్ని హక్కులను తాను ఉపయోగించుకుంటానని తేల్చి చెప్పారు. గతంలో ఆయా కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నప్పటికీ నేరుగా ఈడి కార్యాలయానికి పిలవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఒక మహిళను తన నివాసంలో విచారించాలని కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. వీటన్నింటినీ ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని అడిగారు.
అయితే… ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గురువారం అంటే.. తొమ్మిదో తారీఖున విచాణరకు హాజరుకావాలని మహిళా దినోత్సవం రోజునే కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నోటీసులపై వెంటనే స్పందించిన కవిత.. తాను పదో తారీఖున ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో పెద్ద ఎత్తున దీక్ష చేయటానికి తలపించారు. ఇందుకు దేశవ్యాప్తంగా ఉన్న పలు రాజకీయ పార్టీల నేతలు మద్దతు తెలిపేందుకు వస్తున్నారు. కాగా.. ఆ కార్యక్రమాలు చూసుకోవాలని.. విచారణకు హాజరు కాలేని తేల్చిచెప్పారు. అయితే.. ఈ నోటీసులపై తన తండ్రి సీఎం కేసీఆర్‌ను కూడా కవిత సంప్రదించారు. కాగా.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. ధైర్యంగా నీ పని నువ్వు చేసుకోవాలని సూచించారు. వెంటనే ఢిల్లీకి వెళ్లారు. అక్కడికి చేరుకున్నాక.. ఈడీకి లేఖ రాశారు కవిత.
- Read More Telangana News And Telugu News