News
lingusamy cheque bounce case, The Warriorr డైరెక్టర్ మోసం..లింగుసామికి జైలు శిక్ష – the warriorr director lingusamy sentrenced 6 months jail in cheque bounce case
పీవీపీ ప్రొడక్షన్ కంపెనీ వద్ద లింగుసామీ గతంలో కోటి రూపాయలు తీసుకున్నాడట. ఆ తరువాత ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో జాప్యం జరిగిందట. ఇక లింగుసామీ ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అవ్వడంతో సదరు సంస్థ ఇలా కోర్టు మెట్లు ఎక్కింది. దీంతో ఇప్పుడు కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
అయితే లింగు సామీ మాత్రం పై కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మద్రాస్ హైకోర్టుకు గనుక లింగుసామీ వెళ్తే.. అక్కడ ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి. లింగుసామీ ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు కూడా సిద్దంగానే ఉన్నట్టు సమాచారం. మొత్తానికి లింగుసామి చెక్ బౌన్స్ కేసు, ఆరు నెలల జైలు శిక్ష అనే వార్తలు మాత్రం ఇప్పుడు ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నాయి.
లింగుసామీ రీసెంట్‌గా రామ్ హీరోగా ది వారియర్ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. అలా లింగుసామీ ప్రయత్నం తెలుగు వారి ముందు తేలిపోయింది.