Entertainment

Liger Vijay Deverakonda: ‘డూయోలాగ్ విత్ బరున్ దాస్’.. విజయ్ దేవరకొండతో టీవీ9 ఎండీ కమ్ సీఈవో ప్రత్యేక ఇంటర్వ్యూ..


లైగర్ ప్రమోషన్లలో భాగంగా హీరో విజయ్ దేవరకొండతో టీవీ 9 నెట్‏వర్క్ ఎండీ కమ్ సీఈవో బరున్ దాస్ ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు.

Tollywood: మోస్ట్ అవైయిటెడ్ ఫిల్మ్ లైగర్ (Liger). మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ మూవీలో విజయ్ (Vijay Deverakonda) నత్తి కలిగిన బాక్సర్ పాత్రలో నటిస్తుండడంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. తల్లి ఆశయాన్ని సాధించడం కోసం కొడుకు పడే ఆరాటం.. సాహసమే లైగర్. ఇందులో బీటౌన్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీతో అనన్య సౌత్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. అంతేకాకుండా ఇందులో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలకపాత్రలలో కనిపించనున్నారు. ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా రేపు (ఆగస్ట్ 25న) పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది.

ఈ క్రమంలో లైగర్ ప్రమోషన్లలో భాగంగా హీరో విజయ్ దేవరకొండతో టీవీ 9 నెట్‏వర్క్ ఎండీ కమ్ సీఈవో బరున్ దాస్ ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు. తన లైఫ్ గురించి, ఫిలాసపీ గురించి, సినిమాల గురించి ఎన్నో ఇంట్రస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా న్యూస్ 9 ప్లస్ యాప్ (News 9plus) రిలీజ్ అయ్యింది. ఆ వీడియోను దిగువన వీక్షించండి. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి వీడియో రేపు (ఆగస్ట్ 25న) విడుదల కానుంది. ఈ వీడియో చూడాలంటే News 9plus యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

Android మరియు iOS యూజర్లు పక్కనున్న లింక్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి  : http://onelink.to/htmqpz

 



మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisement

ఇవి కూడా చదవండి



లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button