News

Liger: లైగర్ క్రేజ్ మాములుగా లేదుగా.. స్పెషల్ ఎమోజీ క్రియేట్ చేసిన ట్విట్టర్.. | Vijay Deverakonda Liger movie directed by Puri Jagannadh gets new Twitter Emoji


దేశవ్యాప్తంగా సందడి చేస్తున్నారు లైగర్ టీమ్.. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.

దేశవ్యాప్తంగా సందడి చేస్తున్నారు లైగర్(Liger)టీమ్.. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే పలు నగరాల్లో లైగర్ టీమ్ పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలోనూ లైగర్ హడావిడి కనిపిస్తోంది. రోజూ ఈ సినిమాకు సంబంధించిన ఎదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.

తాజాగా లైగర్ సినిమా ఎమోజీని సాధించింది. ప్రభాస్ సాహూ సినిమా తర్వాత కేజీఎఫ్ 2 , మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలు ఎమోజీని దక్కించుకున్నాయి. ఇక ఇప్పుడు లైగర్ సినిమాకు ట్విట్టర్ ఎమోజీని క్రియేట్ చేసింది దాంతో లైగర్ టీమ్ ట్విట్టర్ కు థాంక్స్ చెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేశారు చిత్రయూనిట్. ఇక లైగర్ టీమ్ ఇటీవలే తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. ఇక ఈ మూవీ ఆగస్ట్ 20న సాయంత్రం 5 గంటలకు గుంటూరు జిల్లా మోతడక ప్రాంతంలోని చలపతి ఇన్‏స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రౌండ్స్‏లో లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‏ను నిర్వహించనున్నట్లుగా ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేశారు మేకర్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Advertisement

ఇవి కూడా చదవండి



లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button