News

Life Style: రెండో బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధమవుతున్నారా.. ఈ టిప్స్ పాటిస్తే చాలా బెటర్..


Second Baby Pregnant

మాతృత్వం అనేది అత్యంత అందమైన అనుభూతి. పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తూ.. పిల్లలు పుట్టాక ఇలా చేయాలి, అలా చేయాలి అని చేసుకునే ప్లాన్స్ చేసుకునే పేరెంట్స్ కు కొదవే లేదు. అయితే అంతా బాగానే ఉన్నా భార్యా భర్తలు తల్లీదండ్రులు కావడం వల్ల కొన్ని చిక్కులు కూడా వస్తాయి. ఇప్పటికే ఒకరు సంతానం ఉండి, మరొకరిని కనేందుకు సిద్ధమయ్యే తల్లిదండ్రులు మరికొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలి. కుటుంబాన్ని విస్తరించాలకునే ఆలోచనలో ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలూ ఉన్నాయి. జీవితంలో అత్యంత అందమైన దశలో ఉన్నప్పుడు భయాందోళనలు చాలా సాధారణం. రాబోయే మార్పుల కోసం మనసును, శరీరాన్ని సిద్ధం చేసుకోవడం కష్టంగా ఉన్నప్పటికీ.. ఈ ప్రయాణంలో మీరు ఒంటరిగా లేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కుటుంబసభ్యుల సహాయసహకారాలు ఎల్లప్పుడూ తమతో పాటే ఉన్నాయని భావించాలి. అయితే.. రెండో సారి పిల్లల్ని జన్మనిచ్చేందుకు సిద్ధమయ్యే భార్యాభర్తలు ఈ పద్ధతులు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

ఆర్థిక అంశాలు.. రెండో సంతానానికి జన్మనివ్వాలని కోరుకుంటే మీ ఆర్థిక పరిస్థితులను అంచనా వేయాల్సిన అవసరం ఉంది. ఖర్చులను భరించడానికి, అదనపు వ్యయం కోసం డబ్బును సిద్ధంగా ఉంచుకున్నారా లేదా అనే విషయాన్ని గురించి ఆలోచించుకోవాలి. పుట్టిన పిల్లలకు చాలా అవసరాలు ఉంటాయి. వారికి అవసరమైన డైపర్‌లు, వైప్‌లు, పిల్లల సంరక్షణ ఉత్పత్తులు, బొమ్మలు, బట్టలు కొనుగోలు చేసేందుకు, అనారోగ్యానికి గురైతే ఆస్పత్రి ట్రీట్ మెంట్ ఖర్చులకు సరిపడా ఆదాయ వనరులను బేరీజు వేసుకోవాలి.

మానసిక ఆరోగ్యం.. సంతానానికి జన్మనిచ్చే సమయంలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మెంటల్ హెల్త్ అనేది జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బిడ్డను కనడం మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని భావించినట్లయితే ఆ ఆలోచనను మానుకోవడమే మంచిది.

శారీరక ఆరోగ్యం.. పిల్లల్ని కనడంతో తల్లి శారీరక ఆరోగ్యం చాలా ముఖ్యం. ఇది చాలా ముఖ్యమైన విషయం. రెండో బిడ్డను కనడానికి సరైన సమయం కాదని తల్లి భావిస్తే బిడ్డకు జన్మనివ్వకపోవడమే ఉత్తమం. భాగస్వామి, స్నేహితులు, కుటుంబం, సమాజం నుంచి ఎదురయ్యే ఒత్తిడికి గురై.. నిర్ణయాలు తీసుకోవడం సరైన విధానం కాదు. ఇటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో స్వత్రంతగా ఉండటం చాలా అవసరం.

వయస్సు అంతరం.. కుటుంబాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నప్పుడల్లా తోబుట్టువుల మధ్య వయస్సు అంతరాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమైనప్పటికీ తోబుట్టువుల మధ్య కనీస గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. దీని ద్వారా ఎక్కువ ఆప్యాయత, అభిమానం పెంపొందుతాయి.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం  క్లిక్ చేయండి

Advertisement

Related Articles

Back to top button