News

Lic Policy,Jeeavan Tarun: మీ పాప పెళ్లికి రూ.28 లక్షలు ఇచ్చే ప్లాన్.. రోజుకు ఇంత కడితే చాలు! – lic jeevan tarun policy for child education invest rs 171 per day get rs 28 lakhs


Jeeavan Tarun: పిల్లలు పుట్టిన వెంటనే వారి భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేస్తున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరిగింది. వారి చదువుల కోసం లక్షల్లో ఖర్చు అవుతుండడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య, పైచదువులకు విదేశాలకు వెల్లడం వంటివి మోయలేని భారంగా మారుతున్నాయి. అలాంటి వారు పిల్లలు పుట్టిన వెంటనే తమ సంపాదనలో రోజుకు కొంత పొదుపు చేసుకున్నట్లయితే వారి చదువులకు ఎలాంటి ఢాకా లేకుండా ఉంటుంది. అలాంటి వారికి ఒక అద్బుతమైన ప్లాన్ అందుబాటులో ఉంది. అదే భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) అందిస్తోన్న జీవన్ తరుణ్ పాలసీ (Jeevan Tarun Policy). ఈ పాలసీని తీసుకుని క్రమంగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా పిల్లలకు ఒక వయసు వచ్చే సరికి రూ.28 లక్షలు చేతికి వస్తాయి. దీంతో వారి పైచదువులు, పెళ్లి ఖర్చులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

ఎల్ఐసీ జీవన్ తరుణ్ పాలసీ కొనుగోలు చేయాలంటే మీ పిల్లల వయస్సు కనిష్ఠంగా 3 నెలల నుంచి గరిష్ఠంగా 12 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఈ వయసు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ పాలసీని కొనుగోలు చేసి క్రమంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. మీ పిల్లలకు 20 ఏళ్ల వయసు వచ్చే వరకు ఇందులో పెట్టుబడి పెడుతుండాలి. ఆ తర్వాత 5 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అంటే 5 ఏళ్ల వరకు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. మొత్తంగా మీ పిల్లల వయసు 25 ఏళ్లు వచ్చిన తర్వాత మీరు పెట్టిన డబ్బులు, వాటిపై వచ్చే బోనస్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ డబ్బులు మీ పిల్లల పైచదువులు, పెళ్లి ఖర్చులకు మీకు ఎంతగానో ఉపయోపడతుందని కచ్చితంగా చెప్పవచ్చు. పెద్ద మొత్తంగా ఒకేసారి చేతికి డబ్బు రావడం మీకో ఎంతో భరోసా కల్పిస్తుంది.

ఎల్ఐసీ జవన్ తరుణ్ పాలసీలో కనీసం రూ. 75 వేల బేసిక్ సమ్ అష్యూర్డ్ చేయాల్సి ఉంటుంది. గరిష్ఠ పరిమితి ఏమీ ఉండదు. మీరు ఆ తర్వాత ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే మీరు కట్టే ప్రీమియం ఆధారంగా మీకు వచ్చే రిటర్న్స్ ఉంటాయని గుర్తుంచుకోవాలి. నెల, మూడు నెలలు, ఆరు నెలల, వార్షిక ప్రీమియం ఆప్షన్లు ఉంటాయి. జీవన్ తరుణ్ పాలసీ అనేది నాన్ లింక్డ్, పార్టిసిపేటింగ్ ప్లాన్. ఒక వ్యక్తి 12 ఏళ్ల వయసు ఉన్న తన పాప పేరుపై ఈ పాలసీ తీసుకున్నట్లయితే రోజుకు 150 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ. 54, 750 అవుతుంది. అలా పాపకు 20 ఏళ్లు వచ్చే వరకు అంటే 8 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాలి. మొత్తం మీ డిపాజిట్ రూ. 4.38 లక్షలు అవుతుంది. దీనిపై మీకు రూ. 2.47 లక్షలు బోనస్ వస్తుంది. పాప వయసు 25 ఏళ్లు వచ్చే సరికి మీకు రూ. 7 లక్షలు అందుతాయి. మరోవైపు.. మీ పాప వయసు 2 ఏళ్లు ఉన్నప్పుడు రోజుకు రూ.171 చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లయితే 18 ఏళ్లలో మీ పెట్టుబడి రూ. 10, 89, 196 అవుతుంది. మెచ్యూరిటీ తర్వాత మీకు రూ. 28, 24, 800 చేతికి వస్తాయి.

  • Read Latest Business News and Telugu News

SWP: నెల నెలా చేతికి రూ.1 లక్ష.. ఆపై పెట్టుబడీ వచ్చేస్తుంది.. ఏం చేయాలంటే? Bonus Shares: ఒక్క షేరు కొంటే 15 షేర్లు ఫ్రీ.. దెబ్బకు దశ తిరిగింది.. లక్షకు రూ.10 లక్షల లాభం! కోడలికి కిడ్నీ దానం చేసిన 70 ఏళ్ల అత్త.. హ్యాట్సాఫ్!

Related Articles

Back to top button