latest gold prices, Gold Rate Today: గుడ్ న్యూస్.. నెల ఆరంభంలోనే దిగొచ్చిన బంగారం ధరలు.. పడిపోయిన వెండి! – gold price silver rates today 2 august 2022 india hyderabad
గోల్డ్ జంప్.. సిల్వర్ డౌన్
దేశీ మార్కెట్లో పసిడి రేట్లను ప్రభావితం చేసే అంతర్జాతీయ మార్కెట్లోని బంగారం, వెండి ధరలను ఇప్పుడు తెలుసుకుందాం. బంగారం ధర ఈరోజు పైకి చేరింది. వెండి మాత్రం పడిపోయింది. పసిడి రేటు ఔన్స్‌కు 0.45 శాతం పెరుగుదలతో 1795 డాలర్లకు చేరింది. అలాగే సిల్వర్ రేటు ఔన్స్‌కు 0.02 శాతం తగ్గింది. 20.36 డాలర్లకు దిగి వచ్చింది.
పెరిగిన బంగారం నిల్వలు
మరోవైపు కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వద్ద బంగారం నిల్వలు పెరిగాయి. 2021 క్యూ2లో బంగారం ధర 705 టన్నులుగా ఉండేవి. 2022 క్యూ2కు వచ్చేసరికి ఇవి 768 టన్నులకు చేరాయి. భారత్ గత కొన్నేళ్లలో బంగారం నిల్వలను క్రమంగా పెంచుకుంటూ వచ్చింది. 2018 జూన్ నెలలో 561 టన్నులుగా ఉన్న బంగారం నిల్వలు ఇప్పుడు ఏకంగా 36 శాతానికి పైగా పెరిగాయని చెప్పుకోవచ్చు. ఫారెక్స్ నిల్వలను డైవర్సిఫైడ్ చేసుకోవాలనే లక్ష్యంతో కేంద్ర బ్యాంక్ ఇలా బంగారం నిల్వలను పెంచుకుంటూ వచ్చింది. కేవలం భారత్ మాత్రమే కాకుండా ఇతర దేశాలు కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. వాటి నిల్వలను పెంచుకుంటూ వస్తున్నాయి. పారెక్స్ రిజర్వులో బంగారాన్ని ఎక్కువగా కలిగిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది.
Also Read: August New Rules: నేటి నుంచి కొత్త రూల్స్.. బ్యాంకుల నుంచి పీఎం కిసాన్, గ్యాస్, ట్యాక్స్ వరకు మారే 5 అంశాలివే!
Also Read: August Bank Holidays: ఆగస్ట్ నెలలో బ్యాంకులకు 19 రోజులు సెలవులు.. దేశవ్యాప్తంగా బ్యాంక్ హాలిడేస్ ఇలా!
20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్స్క్రయిబ్ చేసుకోగలరు.