Khushbu Sundar : కన్న తండ్రితోనే ఖుష్బూకు లైంగిక వేధింపులు.. సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్..
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తల్లిని ఎప్పుడూ కొట్టేవాడని.. చిన్నపిల్లలు వేధింపులు గురయైనప్పుడు అది వారి జీవితానికి ఓ మచ్చల మిగిలిపోతుందని అన్నారు.
ఎనిమిదేళ్ల వయసులోనే తాను లైంగిక వేధింపులకు గురయ్యానని హీరోయిన్.. బీజేపి నాయకురాలు ఖుష్బూ సంచలన కామెంట్స్ చేశారు. చిన్న వయసులోనే తన తండ్రి తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని.. తనను గాయపరిచి.. చిత్రహింసలు పెట్టేవాడని చెప్పారు. అబ్బాయైనా, అమ్మాయైనా బాల్యంలో దూషణకు గురైతే అది వారి జీవితంలో మాయని మచ్చగా నిలిచిపోతుందని కుష్బు అన్నారు. తన తల్లి వైవాహిక జీవితం ఏ మాత్రం సాఫీగా సాగలేదని కుష్బు అన్నారు. భార్య, పిల్లలను కొట్టడం తన జన్మహక్కని తన తండ్రి భావించేవారని తెలిపారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తల్లిని ఎప్పుడూ కొట్టేవాడని.. చిన్నపిల్లలు వేధింపులు గురయైనప్పుడు అది వారి జీవితానికి ఓ మచ్చల మిగిలిపోతుందని అన్నారు.
“ఒక అమ్మాయి లేదా అబ్బాయి.. ఎవరైనా చిన్న పిల్లలు వేధింపులకు గురైనప్పుడు.. అది వారి జీవితానికి మచ్చల మిగిలిపోతుంది. వారిని జీవితాంతం భయానికి గురి చేస్తుంది. తన భార్యాపిల్లల్ని చిత్రహింసలు పెట్టడం.. కన్న కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడడాన్ని జన్మహక్కుగా భావించే వ్యక్తి వల్ల నా తల్లి వైవాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడింది. ఎనిమిదేళ్ల వయసులోనే నేను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను. ఈ విషయాన్ని చెబితే మా అమ్మ నమ్ముతుందో లేదోనని ఎంతో భయపడ్డాను. ఎందుకంటే తన భర్త దేవుడని నమ్మే మనస్తత్వం ఆమెది.
15 ఏళ్ల వయసులో ఆయనకు ఎదురుతిరగడం స్టార్ట్ చేశారు. నాకు 16 ఏళ్లు రాకముందే ఆయన మమ్మల్ని వదిలివెళ్లిపోయాడు. ఆ సమయంలో మేము అనేక సమస్యలు ఎదుర్కొన్నాం.” అని అన్నారు. సంప్రదాయం ముస్లిం కుటుంబం నుంచి వచ్చిన తన తల్లి పెద్దగా చదువుకోకున్నా తనను మాత్రం ఉన్నతంగా తీర్చిదిద్దారని తెలిపారు. తాను ఇవాళ ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం తన తల్లేనని కుష్బు స్పష్టం చేశారు. తన తండ్రి చేసిన పని వల్ల తాను ఎంతో గాయపడ్డానని, మనుషుల మీద నమ్మకం పోయిందని కుష్బు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా దగ్గరకొస్తుంటే భయపడిపోయేదాన్ని అన్నారు. వాస్తవానికి ఈ వీడియో రెండేళ్ల నాటిది.
తెలుగు, తమిళ్ చిత్రపరిశ్రమలో అనేక చిత్రాల్లో నటించిన ఖుష్బూ.. 2010లో డీఎంకే పార్టీలో చేరింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో కొనసాగుతున్నారు. 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తరపున పోటీ చేశారు. ఇటీవల ఖుష్భూకు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.