News
kuravi mpp, ఈ రోజుల్లో ఇలాంటి రాజకీయాలా?.. ఈమెకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే..! – kuravi mpp going to daily wage in mahabubabad district
అటువంటి వాళ్లను ప్రస్తుతం సమాజంలో వేళ్లమీదే లెక్కెట్టవచ్చు. అలాంటి వారిలో ఒకరే… మహబూబాబాద్ జిల్లా కురవి మండలాధ్యక్షురాలు (MPP) పద్మావతి. తాను ఓ మండలానికి ఎంపీపీని అయినా ఆమెలో ఎలాంటి గర్వం లేదు. సాదాసీదాగా రాజకీయ జీవితాన్ని గడుపుతున్నారు. ఓ వైపు రాజకీయంగా తాను పదవిలో కొనసాగుతున్నా.. మరోవైపు పూట గడవటం కోసం కూలీ పనులకు వెళ్తున్నారు. శనివారం (ఏప్రిల్ 1న) ఉదయం కురవి మండలంలోని ఐకేపీ మండల సమాఖ్య కార్యాలయం భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె ఎమ్మెల్యే రెడ్యానాయక్‌తో కలిసి పాల్గొన్నారు. ఆ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నానికి ఓ రైతు పొలంలో మిర్చి తోటలో కూలీ పనులకు వెళ్లారు.
తాను వృత్తిరీత్యా రాజకీయాల్లోనే ఉన్నా.. బతుకుదెరువు కోసం కూలీ పనులకు వెళ్లక తప్పని పరిస్థితి అని పద్మావతి వెల్లడించారు. తన భర్త గగులోతు రవి బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్నారని చెబుతున్నారు. తాను మండల స్థాయి పదవిలో ఉన్నా.. ఇల్లు గడవాలంటే కూలీ పనులు చేసుకోక తప్పదు కదా అని అంటున్నారు. పద్మావతి సింప్లిసిటీని చూసి పలువురు ప్రశంసిస్తున్నారు. వార్డు మెంబర్ స్థాయికే నానా హంగామా చేసే రాజకీయ నాయకులున్న ఈ రోజుల్లో మండల స్థాయి పదవిలో కొనసాగుతున్నా.. సాధారణ కూలీ పనులకు వెళ్తున్న ఆమె ప్రయాణం స్పూర్తిదాయకమంటూ హ్యాట్సాప్ చెబుతున్నారు.
- Read More Telangana News And Telugu News