News

kukatpally building accident, కూకట్‌పల్లి: కూలిన భవనం 4వ అంతస్తు శ్లాబ్.. – construction building 4th floor slab collapses in kukatpally, 2 trapped in debris


హైదరాబాద్: నిర్మాణంలో ఉన్న ఓ భవనం నాలుగో అంతస్తు శ్లాబ్‌ కూలిపోయింది. కూకట్‌పల్లిలో బీజేపీ ఆఫీస్ సమీపంలో పాపారాయుడు విగ్రహం వద్ద శనివారం (జనవరి 7) మధ్యాహ్నం నిర్మాణంలో ఉన్న భవనం నాలుగో అంతస్తు శ్లాబ్‌ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద ఇద్దరు కూలీలు చిక్కుకున్నారు. వీరిని ఉత్తర్ ప్రదేశ్‌కు దయ, ఆనంద్‌గా గుర్తించారు. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. భవనంలో 4వ, 5వ అంతస్తులో పనులు జరుగుతుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనకు సంబందించిన సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

పనుల్లో నాణ్యతాలోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. భవనం మరికొంత భాగం కూడా కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Back to top button