News
ktr video viral, దేశంలోనే బెస్ట్ ఫిష్ మార్కెట్ రాంనగర్‌లో.. కేటీఆర్ టాప్ క్లాస్ ఐడియా.. వీడియో వైరల్..! – minister ktr gives suggestions to muta jaisimha about fish market in ramnagar hyderabad
అయితే ఆ వీడియోలో.. “నువ్వు యువకుడివి. బాజా చదువుకున్నావ్. నీకు జగ ఇస్తా. పైసల్ కూడా వెంటనే ఇస్తా. దేశంలోనే ది బెస్ట్ ఫిష్ మార్కెట్ నిర్మించేలా డిజైన్ సిద్ధం చేయ్యి. ఇండియాలో బెస్ట్ ఫిష్ మార్కెట్ ఎక్కడుంది అంటే.. అందరూ రాంనగర్ మార్కెట్‌కు వచ్చి చూడాలి. అలా ఉండాలి. అందుకు సంబంధించి డిజైన్‌ను వారం రోజుల్లో సిద్ధం చేసి నా దగ్గరికి తీసుకురా. వళ్లీ ఆ మార్కెట్ కూడా అన్ని సౌకర్యాలతో టాప్ క్లాస్‌గా ఉండాలి. పార్కింగ్ సౌకర్యం.. వాటర్.. ఇలా అన్ని ఫెసిలిటీస్ ఉండేలా చూసుకోవాలి. ఏదో ఆగమాగం కట్టి.. వాళ్లు వీళ్లతో మాటలు అనిపించుకునేలా ఉండకూడదు.” అంటూ ముఠా జయసింహాకు కేటీఆర్ ఇన్‌పుట్స్ ఇచ్చారు.
ఇందుకు సంబంధించిన వీడియోను జయసింహ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేస్తూ.. మంత్రి కేటీఆర్ ఎప్పుడూ తన ఆలోచనలతో తమను మరింతగా కష్టపడేలా ఎంకరేజ్ చేస్తూనే ఉంటారని రాసుకొచ్చారు. అయితే.. ఈ పోస్ట్‌కు చాలా మంది నుంచి స్పందన వస్తోంది. అటు ముఠా జయసింహకు అభినందనలతో పాటు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. మరికొందరు.. కేటీఆర్ ఆలోచనలన్ని టాప్ క్లాస్‌గా ఉంటాయంటూ కొనియాడుతున్నారు.
- Read More Telangana News And Telugu News