News

ktr, MLAs Purchase: పార్టీ శ్రేణులు పట్టించుకోవద్దు: కేటీఆర్ – minister ktr warns trs leaders on mlas purchasing case


TRS పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ భారీ మొత్తం డబ్బుతో కొనుగోలు చేసేందుకు కుట్ర చేసిందనే వార్త తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన వార్తలు, వీడియోలు బయటకి రాగానే బీజేపీ చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా ఆ పార్టీ ముఖ్య నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇదంతా టీఆర్‌ఎస్ పార్టీ ఆడుతున్న నాటకమని.. ఆ డ్రామా చూస్తుంటే నవ్వు వస్తోందంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఈ అంశంపై మీడియా సమావేశం నిర్వహిస్తారని ఎదురు చూస్తుండగా.. ఇప్పటివరకూ ఆ ఊసే లేదు. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు (KTR) స్పందించారు. పార్టీ శ్రేణులకు కీలక సూచన చేశారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణలో ఉన్నందున పార్టీ నాయకులెవరూ మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కేటీఆర్ సూచించారు. ‘అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్లు మొరుగుతారు.. పట్టించుకోవద్దు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వాఖ్యానాలు చేయవద్దని విజ్ఞప్తి. అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే ఉంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Photos:బేరసారాలు చేసిన వ్యక్తులు వీళ్లేనంటూ ఫొటోలు వైరల్

Related Articles

Back to top button