’60 ఏళ్ల వయసులో రెండో పెళ్లా..? కొంచెమైనా సిగ్గుండాలి’ ఆశిష్ విద్యార్థి పెళ్లిపై కేఆర్కే వైరల్ కామెంట్స్
ప్రముఖ బాలీవుడ్ సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) ఆశిష్ విద్యార్ధి రెండో పెళ్లిపై సోషల్ మీడియా వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. సినీ తారలపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ బాలీవుడ్ నాట వివాదాస్పద సినీ విమర్శకుడిగా కేఆర్కేకు పేరు. తాజాగా ఆయన ఆశిష్ విద్యార్ధి రెండో పెళ్లి చేసుకున్నందుకు..

KRK tweet on Ashish Vidyarthi
ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలసిందే. గువాహటికి చెందిన ఫ్యాషన్ ఎంట్రప్రెన్యూర్ రుపాలీ బరూవాను ఆయన బుధవారం అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైలర్ అవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు, ఫ్యాన్స్ ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఐతే ప్రముఖ బాలీవుడ్ సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) ఆశిష్ విద్యార్ధి రెండో పెళ్లిపై సోషల్ మీడియా వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. సినీ తారలపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ బాలీవుడ్ నాట వివాదాస్పద సినీ విమర్శకుడిగా కేఆర్కేకు పేరు. తాజాగా ఆయన ఆశిష్ విద్యార్ధి రెండో పెళ్లి చేసుకున్నందుకు కంగ్రాట్స్ తెలిపారు. అంతటితో ఆగకుండా ’60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడానికి కొంచెమైనా సిగ్గుండాలి బాయ్‌సాబ్!’ అంటూ వారి పెళ్లి ఫొటోను షేర్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇక కేఆర్కే ట్వీట్‌కు నెటిజన్లు బాగానే కౌంటర్ ఇస్తున్నారు.
‘నీకు అసూయగా ఉన్నట్లు ఉంది, సిగ్గు పడాలా? ఎందుకు.. దేనికి’, ‘ఆయన వృద్ధాప్యంలో పెళ్లి చేసుకోవడం నీకు ఇబ్బందిగా ఉందా? తప్పేంటి..’, ‘పెళ్లికి వయసుతో సంబంధం లేదు. ఇది చాలా నార్మల్ విషయం. ‘ఇతరుల జీవితాల్లో సంతోషకరమైన క్షణాలను చూసి ఓర్వలేకపోతే మౌనంగా ఉండటం మంచిది’. ‘బ్రదర్.. నీసంగతేంటి? నువ్వు చేసుకోలేదా ఇంకో పెళ్లి?’.. అంటూ పలువురు తమదైన శైలిలో ఆర్కేకు చురకలు అంటిస్తున్నారు.
Congratulations to 60 years old actor Ashish Vidyarthi who got married second time. Kucch to Sharam Kar lete Bhaisaab! pic.twitter.com/15cOyRYQd1
Advertisement— KRK (@kamaalrkhan) May 25, 2023
కాగా ఇరు కుటుంబాలు, అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరు రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుపాలీని పెళ్లి చేసుకోవడం ఓ అద్భుతమైన ఫీలింగ్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. వేడుకల ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోగా అవి వైరల్ అయ్యాయి. సుమారు 20 ఏళ్ల కిత్రం.. నటి శాకుంతల బరూవా తనయ రాజోషిని పెళ్లి చేసుకున్నారు ఆశిష్. ఈ దంపతులకు ఒక కొడుకు ఉన్నాడు. పలు కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు. ఆశిష్- రుపాలీ మధ్య కొంతకాలం క్రితం మొదలైన స్నేహం.. ప్రేమగా మారి పెళ్లి పీటలెక్కించింది. కోల్‌కతాలోని ఓ ప్రముఖ ఫ్యాషన్ స్టోర్‌లో రుపాలీకి భాగస్వామ్యం ఉందని సమాచారం.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి