Ramya Krishna: ‘ఆమె ఓ ఏంజిల్, తను ఏం చెప్పినా బ్లైండ్‌గా ఫాలో అవుతా’.. రమ్మకృష్ణ గురించి కృష్ణవంశీ..
గులాబీ, సింధూరం, ఖడ్గం, అంతఃపురం, మురారి వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన ఆయన.. ప్రస్తుతం రంగమార్తండ మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్

Krishnavamshi Ramyakrishna
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్స్ తెరకెక్కించిన అగ్రదర్శకులలో కృష్ణవంశీ ఒకరు. క్రియేటివ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకుని ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ సినిమాలను రూపొందించారు. అయితే గతకొంతకాలంగా ఆయన నుంచి వచ్చే చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. గులాబీ, సింధూరం, ఖడ్గం, అంతఃపురం, మురారి వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన ఆయన.. ప్రస్తుతం రంగమార్తండ మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే రంగమార్తండ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణవంశీ మాట్లాడుతూ… రమ్యకృష్ణ (Ramya Krishna) గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
రమ్యకృష్ణ, కృష్ణవంశీ మధ్య విభేదాలు తలెత్తాయనని పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ రూమర్స్ పై స్పందించిన కృష్ణవంశి.. తమ మధ్య ఎలాంటి విభేదాలు రాలేదని.. తమ వైవాహిక జీవితం గురించి వచ్చే వార్తలను మేము పట్టించుకోలేదని తెలిపారు.. వివాహం జరిగినప్పటి నుంచి రమ్యకృష్ణ ఇష్టాలను తాను గౌరవిస్తానని అన్నారు. రమ్యకృష్ణ మిమ్మల్ని ఏ విషయంలోనైనా ఆపారా ? ఇది వద్దు.. చేయకూడదు అంటూ ఏమైనా చెప్తారా అని యాంకర్ ప్రశ్నించగా.. ఫుడ్ విషయంలో ఆమె జాగ్రత్తలు చెప్తుందని.. ఆమె ఏమి చెప్పినా బ్లైండ్‌గా ఫాలో అవుతానని చెప్పారు. అంతేకాకుండా ఆమె ఓ ఏంజిల్.. అన్ని విషయాల్లో ఆమె నచ్చుతుందని అన్నారు కృష్ణవంశి. తన తదుపరి సినిమాల్లో ఆమెకు సరైన పాత్ర ఉంటే చేయాలని అడుగుతాము.. ఆమెకు డేట్స్ కుదిరితే నటిస్తుందని అన్నారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.