News
kl rahul, Shubman Gill కోసం భారత కెప్టెన్ త్యాగం.. చెలరేగిపోయిన ఓపెనర్ – india opener shubman gill scored a fine 82* off 72 deliveries
భారత్, జింబాబ్వే మధ్య గురువారం హరారే వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగగా.. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా ఆడతాడని అంతా ఊహించారు. మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే టీమ్ 189 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్యఛేదనకి ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి శుభమన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. దాంతో అంతా ఆశ్చర్యపోయారు. ఐపీఎల్ 2022 తర్వాత ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేకపోయిన కేఎల్ రాహుల్‌కి ఆసియా కప్‌కి ముందు కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడే అవకాశం ఉండగా.. ఫస్ట్ ఛాన్స్‌ని గిల్‌కి ఇచ్చేశాడు. ఇక రెండు వన్డేల్లో మాత్రమే రాహుల్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.
కేఎల్ రాహుల్ త్యాగం వృథా కాలేదు. 190 పరుగుల ఛేదనలో దూకుడుగా ఆడేసిన శుభమన్ గిల్ కేవలం 72 బంతుల్లోనే 10×4, 1×6 సాయంతో అజేయంగా 82 పరుగులు చేశాడు. అలానే శిఖర్ ధావన్ (81 నాటౌట్: 113 బంతుల్లో 9×4)తో కలిసి తొలి వికెట్‌కి అజేయంగా 192 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లోనూ శుభమన్ గిల్ ఓపెనర్‌గా అదరగొట్టేశాడు. ఆ సిరీస్‌లో 82*(72 బంతుల్లో), 98*(98 బంతుల్లో), 43(49 బంతుల్లో) పరుగులు చేశాడు. దాంతో అతని లయని దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో రాహుల్ అతనికే తొలి వన్డేలో ఓపెనర్‌గా ఛాన్సిచ్చినట్లు తెలుస్తోంది.