News
kkr vs lsg highlights, Rinku Singh: ఐపీఎల్ 2023 నుంచి కోల్‌కతా ఇంటికి.. లక్నో ప్లేఆఫ్స్‌కి – lucknow super giants beat kolkata knight riders by 1 run in ipl 2023
176 పరుగుల ఛేదనలో కోల్‌కతాకి జేసన్ రాయ్ (45: 28 బంతుల్లో 7×4, 1×6) మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. అతనితో పాటు ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (24: 15 బంతుల్లో 3×4, 1×6) దూకుడుగా ఆడినా వేగంగా ఔటైపోయాడు. అనంతరం వచ్చిన నితీశ్ రాణా (8), రహ్మనుల్లా (10), ఆండ్రీ రసెల్ (7), శార్ధూల్ ఠాకూర్ (3), సునీల్ నరైన్ (1) తేలిపోయారు. కానీ చివరి వరకూ ఒంటరి పోరాటం చేసిన రింకు సింగ్ మ్యాచ్‌లో కోల్‌కతా గెలిపించేలా కనిపించాడు. అయితే కోల్‌కతా విజయానికి చివరి 3 బంతుల్లో 19 పరుగులు అవసరం అవగా.. బౌలర్ యశ్ ఠాకూర్ ఓ వైడ్ వేశాడు. దాంతో సమీకరణం 3 బంతుల్లో 18 పరుగులగా మారిపోయింది. ఈ దశలో వరుసగా రింకు సింగ్ 6, 4, 6 బాదాడు. కానీ.. ఒక్క పరుగు తేడాతో ఓటమి తప్పలేదు.
మ్యాచ్‌లో అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ నికోలస్ పూరన్ (58: 30 బంతుల్లో 4×4, 5×6) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అలానే ఓపెనర్ డికాక్ (28), ప్రీరాక్ మాన్కడ్ (26), ఆయుష్ బదోని (25) కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. కానీ ఫామ్‌లో ఉన్న హిట్టర్ స్టాయినిస్ (0) డకౌటవడం, కెప్టెన్ కృనాల్ పాండ్య (9) తక్కువ స్కోరుకే ఔటైపోవడంతో లక్నో 176 పరుగులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.