kirti chakra 2023, పుల్వామాలో వెన్నుచూపని సైనికవీరుడికి కీర్తి చక్ర.. 15 మందికి శౌర్య చక్ర – list of kirti chakra, shaurya chakra and sena medals gallantry awardees announced for 2023
పుల్వామాలో రెండు రోజుల పాటు ఉగ్రవాదులతో జరిగిన భీకర ఎన్కౌంటర్ తర్వాత భారత సైనికులు పలువురు స్థానికులను ఉగ్రవాదుల చెర నుంచి విడిపించారు. మెరుపు దాడులు చేసి సైనికులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను మట్టుబెట్టారు.
గత ఏడాది ఏప్రిల్ 24న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ ర్యాలీ సందర్భంగా ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టడంతో పాటు ఫిదాయీన్ (fidayeen) దాడిని అడ్డుకున్నందుకు 9 PARA (స్పెషల్ ఫోర్సెస్) కెప్టెన్ టీఆర్ రాకేష్‌కు శౌర్య చక్ర అవార్డు లభించింది.
నవంబర్ 2020లో జరిగిన MiG-29K విమానం ప్రమాదంలో ట్రైనీ పైలట్ ప్రాణాలను కాపాడి కన్నుమూసిన దివంగత కమాండర్ నిశాంత్ సింగ్‌ను ‘నావ్ సేనా మెడల్ (గ్యాలెంట్రీ)’ పురస్కారం ప్రకటించారు.
కీర్తి చక్ర, శౌర చక్ర పురస్కారాలు శాంతి సమయంలో అందించే అత్యున్నత అవార్డులు. దేశ శాంతి భద్రతలను రక్షించడం ఇందులో భాగంగా ఉంటాయి. యుద్ధ సమయంలో ఇచ్చే అత్యున్నత సైనిక పురస్కారం ‘పరమ వీర చక్ర’.