News

Kiraak RP: పంచ్‌ ప్రసాద్‌ కిడ్నీ ఆపరేషన్‌కు డబ్బులిస్తా.. కోలుకునే దాకా ఖర్చంతా నాదే.. కిర్రాక్ ఆర్పీ మంచి మనసు | Kiraak RP says he will give money for Jabardasth Punch Prasad’s kidney transplant operation Telugu Cinema News


Basha Shek

Basha Shek |

Updated on: Jan 12, 2023 | 3:09 PM

గత కొన్ని రోజులుగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ హల్‌చల్‌ చేస్తున్న ఆర్పీ ఓ మంచి పని చేయడానికి ముందుకు వచ్చాడు. గత కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న తన సహచరుడు, జబర్దస్త్ కమెడియన్‌ పంచ్‌ ప్రసాద్‌కి కిడ్నీ ఆపరేషన్‌ చేయిస్తానంటూ ముందుకు వచ్చాడు.

Kiraak RP: పంచ్‌ ప్రసాద్‌ కిడ్నీ ఆపరేషన్‌కు డబ్బులిస్తా.. కోలుకునే దాకా ఖర్చంతా నాదే.. కిర్రాక్ ఆర్పీ మంచి మనసు

Kiraak Rp

నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటూ సోషల్‌ మీడియాలో తెగ ఫేమస్‌ అయిపోయాడు ప్రముఖ కమెడియన్‌ కిర్రాక్‌ ఆర్పీ. కూకట్‌పల్లిలో ప్రారంభించిన ఈ ఫుడ్‌ సెంటర్‌కు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్‌ వచ్చింది. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి. దీంతో కొన్ని రోజుల్లోనే ఈ బ్రాంచ్‌ మూత పడింది. అయితే ఇబ్బందులన్నిటినీ అధిగమించి తిరిగి వారంలోనే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు షాపును ప్రారంభించాడు. కాగా గత కొన్ని రోజులుగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ హల్‌చల్‌ చేస్తున్న ఆర్పీ ఓ మంచి పని చేయడానికి ముందుకు వచ్చాడు. గత కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న తన సహచరుడు, జబర్దస్త్ కమెడియన్‌ పంచ్‌ ప్రసాద్‌కి కిడ్నీ ఆపరేషన్‌ చేయిస్తానంటూ ముందుకు వచ్చాడు. ఆపరేషన్‌ ఖర్చులతో పాటు ప్రతినెలా అతని ఇంటి అద్దెలు చెల్లిస్తానంటూ మీడియా వేదికగా తన మంచి మనసును చాటుకున్నాడు. ‘ నాకేదో పేరు వస్తుందని ఇలా చెప్పడం లేదు. ఈ మాట అందరి ముందు చెప్తే.. నేను తప్పు పనిచేసినప్పుడు నా పరువు పోతుంది. అందుకే పంచ్‌ ప్రసాద్‌ కు సహాయం చేస్తాననని అందరి ముందు చెబుతున్నా. ప్రసాద్‌ వ్యక్తిత్వం నాకు బాగా తెలుసు. వాడి పరిస్థితి ఏమీ బాగోలేదు. బయటకు కనిపిస్తున్నంత సంతోషంగా అయితే వాడు లేడు. ఇప్పుడు నేను అతనికి మాట ఇస్తున్నా’

నేను మాట తప్పను.. అందుకే ఇలా..

‘త్వరలో నేను మణికొండలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాంచ్ ప్రారంభిస్తున్నా. ఆరోజునే పంచ్ ప్రసాద్‌కు ఫస్ట్ చెక్ ఇస్తాను. ఆ తరువాత కిడ్నీ ఆపరేషన్ ఎంత ఖర్చు అవుతుందో అంతా మేమే పెడతాం. వాడు కోలుకునే వరకూ సాయం చేస్తాను. అలాగే రూం రెంట్‌తో సహా ఖర్చులన్నీ ఇస్తాను. పంచ్ ప్రసాద్‌కి ఆస్తులేం లేవు.. అన్నీ అప్పులే ఉన్నాయి. కాబట్టి.. పంచ్ ప్రసాద్ కిడ్నీ ఆపరేషన్‌కి అయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తాను. వచ్చే నెల నుంచి పంచ్ ప్రసాద్ పూర్తి బాధ్యతల్ని మా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు తరుపున నేను తీసుకుంటున్నాం. నిజం చెప్పాలంటే ప్రసాద్‌కి ఎవరూ సాయం చేయడం లేదు. కనీసం ఇంటి అద్దె కూడా కట్టడానికి ఇబ్బందిగా ఉంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు.. భార్య కూడా ఉద్యోగం చేయడం లేదు. అందుకే నా వంతు సహాయం చేస్తాను. నూటికి నూటికి శాతం నేను ఇచ్చిన మాట తప్పను. తను పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యేవరకు ఆర్థికంగా అండగా నిలబడతా’ అని చెప్పుకొచ్చాడు ఆర్పీ. కాగా ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్‌ కిర్రాక్‌ ఆర్పీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మంచి పని చేస్తున్నాడంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు షేర్‌ చేస్తున్నారు.

Advertisement

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button