News

Khammam Politics: నీ చరిత్ర అంతా బయటకు తీస్తాం.. పొంగులేటికి మంత్రి పువ్వాడ కౌంటర్.. – Telugu News | Khammam politics minister puvvada ajay kumar hits back former mp ponguleti srinivas reddy


పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ పువ్వాడ అజయ్. ఖమ్మం రాజకీయం మరోసారి హీటెక్కింది. నిన్న ఖమ్మంలో ఆత్మీయసమ్మేళనం నిర్వహించిన మాజీ ఎంపీ పొంగులేటి.. మంత్రి పువ్వాడ టార్గెట్‌గా విమర్శనాస్త్రాలు సంధించారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ పువ్వాడ అజయ్. ఖమ్మం రాజకీయం మరోసారి హీటెక్కింది. నిన్న ఖమ్మంలో ఆత్మీయసమ్మేళనం నిర్వహించిన మాజీ ఎంపీ పొంగులేటి.. మంత్రి పువ్వాడ టార్గెట్‌గా విమర్శనాస్త్రాలు సంధించారు. అదే రేంజ్‌లో స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు పువ్వాడ. పిట్టల దొరల మాటలకు భయపడే రకం తాను కాదని ధ్వజమెత్తారు.  నీ చరిత్ర అంతా కచ్చితంగా బయటకు తీస్తామని హెచ్చరించారు.  ఖమ్మం జిల్లా నుంచి పొంగులేటిని తరిమి తరిమి కొడుతామన్నారు.

మంత్రి పువ్వాడపై తాను పోటీ చేసి గెలవడం కాదు.. అతనిపై బచ్చాగాడ్ని పెట్టి గెలిపిస్తానంటూ పొంగులేటి చేసిన వ్యాఖ్యలకు పువ్వాడ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో బిచ్చగాడివి, బచ్చావి నీవేనంటూ పొంగులేటిపై పువ్వాడ విరుచుకపడ్డారు. తాను చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని వ్యాఖ్యానించారు. పొంగులేటి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని జోస్యం చెప్పిన పువ్వాడ.. పార్టీ మారిన తర్వాత పొంగులేటికి కేసీఆర్ విలువ ఏంటో తెలుస్తుందన్నారు.

Related Articles

Back to top button