Entertainment

Mohanlal: మోహన్ లాల్‌ను వెంటాడుతోన్న ఏనుగు దంతాల కేసు.. హైకోర్టు కూడా గట్టి షాకిచ్చిందిగా..


గతకొంతకాలంగా ఆయనను ఈ కేసు వెంటాడుతోంది. గతంలో మోహన్ లాల్ ఇంట్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తోన్న సమయంలో రెండు ఏనుగు దంతాలను గుర్తించారు.

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కు కోర్టు షాక్ ఇచ్చింది. మోహన్ లాల్ పై ఏనుగు దంతాల కేసు ఉన్న విషయం తెలిసిందే. గతకొంతకాలంగా ఆయనను ఈ కేసు వెంటాడుతోంది. గతంలో మోహన్ లాల్ ఇంట్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తోన్న సమయంలో రెండు ఏనుగు దంతాలను గుర్తించారు. దాంతో ఆయన పై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద మోహన్ లాల్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాను చట్టప్రకారమే అనుమతులు తీసుకుని ఏనుగు దంతాలను ఇంట్లో పెట్టుకున్నట్లు అప్పుడు మోహన్‌ లాల్‌ కోర్టుకు వివరణ ఇచ్చారు.

అక్కడి ప్రభుత్వం కూడా ఆయనకు మద్దతుగా నిలిచింది. చట్ట ప్రకారమే చనిపోయిన ఏనుగు దంతాలను మోహన్ లాల్ తన ఇంట్లో అమర్చుకున్నారని తెలిపింది. ప్రభుత్వ వైఖరి పై మేజిస్ట్రేట్‌ కోర్టు సీరియస్ అయ్యింది.ఇదే పని సామాన్యుల చేస్తే ఇలానే ఊరుకుంటారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఈ క్రమంలో పెరుంబవూరు మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మోహన్ లాల్ కేరళ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టింది హైకోర్టు మోహన్ లాల్ పిటిషన్‌ను కొట్టివేసింది. పెరుంబవూరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును కొట్టివేయాలని కోరుతూ నటుడు మోహన్‌లాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దాంతో మోహన్ లాల్ కు చుక్కెదురైంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button