News
Kerala High Court,పోర్న్ వీడియోలు చూడటం నేరం కాదు.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు – pornography practice for centuries and watching privately is not offence says kerala high court
తనపై పోలీసులు నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌ను, కోర్టు విచారణను రద్దు చేయాలంటూ నిందితుడు చేసిన అభ్యర్థనపై న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు. అశ్లీలత, పోర్నోగ్రఫీ అనేది శతాబ్దాలుగా ఆచరణలో ఉందని, ఈ డిజిటల్ యుగం పిల్లలకు కూడా దీన్ని మరింత అందుబాటులోకి తెచ్చిందని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
‘ఒక వ్యక్తి తన ప్రైవేట్ సమయంలో పోర్న్ వీడియోను ఇతరులకు ప్రదర్శించకుండా చూడటం నేరంగా పరిగణిస్తారా? అనేది నిర్ణయించాల్సిన ప్రశ్న.. అది అతడి వ్యక్తిగత ఎంపిక కాబట్టి అదే నేరం అని న్యాయస్థానం ప్రకటించదు.. ఇందులో జోక్యం చేసుకోవడం అతడి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తుంది’ అని న్యాయమూర్తి తీర్పు సందర్భంగా స్పష్టం చేశారు.. అశ్లీల వీడియో లేదా ఫోటోలు ఐపీసీ సెక్షన్ 292 కింద నేరంగా పరిగణింపబడుతోందని జస్టిస్ కున్హికృష్ణన్ అన్నారు.
Read More Latest National News And Telugu News